అందం హిందోళం.. ఎందుకీ గందరగోళం..? మిస్ వరల్డ్ పై రాజకీయ రగడ
ఒక కార్యక్రమం జరుగుతోందన్నప్పుడు.. ఆరోపణలు, విమర్శలు రావడం కామన్. వాటికి సమాధానం చెప్పి, అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత కచ్చితంగా ప్రభుత్వానిదే. సరే.. ఆ విషయం పక్కన పెడదాం. అందం పేరు మీద వ్యాపారం జరుగుతుందని, అసలు ఆ వ్యాపారం కోసమే ఇలాంటి అందాల పోటీలు జరుగుతుంటాయని ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ డిటైల్స్‌గా తెలుసుకుందాం..

‘‘అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..’’ అన్నాడో సినీ కవి. కానీ.. అందమే వ్యాపారం.. వ్యాపారమే జీవిత సాఫల్యం అంటున్నాయి.. కొన్ని కార్పొరేట్ కంపెనీలు. అందుకేనేమో..! అందాల పోటీలు జరుగుతున్నప్పుడల్లా ఏదో ఒక రచ్చ. మన దగ్గరనే కాదు.. చాలా విశాల దృక్పథంతో వ్యవహరిస్తామని చెప్పుకునే ఫారెన్ కంట్రీస్‌లోనూ ఇదే లొల్లి..! కాంటెస్ట్ వెనకున్న ప్రొటెస్టులను పక్కన పెడితే.. అందం మీద పెడుతున్న ఖర్చు.. అందాల పోటీల తరువాత పెరిగిన క్రేజు.. ఐశ్వర్యరాయ్, సుస్మితాసేన్ వంటి అందాల భామలు మిస్ యూనివర్స్‌లు.. మిస్ వరల్డ్‌లుగా అవతరించిన తర్వాత.. సమాజం మారిన తీరు.. కాస్మొటిక్స్ బిజినెస్.. పౌడర్ల నుంచి క్రీములు, సీరమ్‌ల దాకా బ్యూటీ ప్రాడక్ట్స్‌పై పెరిగిన మోజు.. వీటన్నింటికీ ఎక్కడో లింక్ ఉన్నట్టు కనిపిస్తోంది కదూ..! పేరుకే బ్యూటీ కాంటెస్ట్ గానీ దాని వెనక జరిగే బిజినెస్ గురించి పెద్దగా చర్చించుకోరు, పట్టించుకోరు చాలామంది. ఓ ప్రాడక్ట్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసే ముందు.. సపోజ్ ఓ కాఫీ బ్రాండే తీసుకోండి.. ఓ వారం పది రోజుల ముందు నుంచి కాఫీ తాగితే లాభాలు, కాఫీతో ఆరోగ్య సూత్రాలు అంటూ ఆర్టికల్స్ ఇస్తుంటారు. ప్రజలను కాఫీ మూడ్‌లోకి తీసుకెళ్తారు. బ్యూటీ కాంటెస్టులు కూడా ఆల్‌మోస్ట్ అలాంటివే. మరీ నెగటివ్‌గా ఆలోచించక్కర్లేదు గానీ.. అందం పేరు మీద ఎన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందో.. ఎన్ని లక్షల మందికి ఉద్యోగ, ఉపాధిని అందిస్తోందో అర్థం చేసుకోవచ్చు....