Telangana: ఎండలో కూల్ కూల్‌గా ఐస్ క్రీం తిందామనకున్నాడు.. పైన కవర్ తీయగానే షాక్
ఐస్ క్రీమ్‌లో పురుగులు వచ్చాయి అని, ఇదేంటి అని ప్రశ్నిస్తే..మార్ట్ వాళ్ళు వినియోగదారున్ని బయటకు వెల్లగొట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వేసవి తాపాన్ని తీర్చడానికి ప్రజలు చల్ల చల్లని కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వైపు మొగ్గు చూపుతారు..వినియోగదారుల ఆశలను అవకాశంగా మలుచుకుని కంపెనీలు సైతం రకరకాల రుచులతో.. సరికొత్త రూపాలతో ఐస్ క్రీమ్స్ తయారుచేసి మార్కెట్లో అమ్ముతారు...ఆ రుచి వాసన చూడగానే మైమరిచిపోయిన వినియోగదారుడు అందులో ఏముంది అని కూడా చూడకుండా లొట్టలు వేసుకుంటా తినడానికి సిద్ధమవుతున్నారు..ఈ స్టోరీ చదివితే ఐస్ క్రీమ్ అంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది.

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్‌లో ఎండవేడిని తగ్గించుకోవడానికి ఐస్ క్రీమ్ తీసుకుందామని ఆత్మకూర్ గ్రామానికి సంబంధించిన సురేష్ వెళ్లాడు. అక్కడే ఉన్నా ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్రీమ్ తీసి బిల్ చెల్లించి బయటకు వచ్చి తినడానికి చూడగా ఆ ఐస్ క్రీమ్‌లో వేలు పొడవున ఉన్న పురుగు దర్శనమిచ్చింది. దాన్ని చూడగానే ఒక్కసారిగా అవాక్కైన సురేష్ తిరిగి షాపు వద్దకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి విషయాన్ని తెలియజేశాడు. ఇవన్నీ తమకు కొత్త కాదని అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయని సిబ్బంది సురేష్ చాలా క్యాజువల్‌గా సమాధానమిచ్చాడు.
ఇలా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో సురేష్ పక్కన ఉన్న వినియోగదారులకు విషయం వివరిస్తూ ఉండగా.. అక్కడే ఉన్న మార్ట్ సిబ్బంది సురేష్‌పై దాడికి యత్నించారు. అక్కడికి వచ్చిన కొందరు సురేష్‌కి మద్దతుగా నిలవడంతో సిబ్బంది వెనుకడుగు వేశారు. అసలు తమ తప్ప ఏమీ లేదని.. ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుందంటూ ఈ ఐస్ క్రీంకు బదులుగా మరొక ఐస్ క్రీం ఇస్తానని అక్కడి మార్ట్‌లో ఉన్నటువంటి సిబ్బంది చెప్పడం కోసం మెరుపు.
ఇప్పటికైనా ఆహార భద్రత అధికారులు జోక్యం చేసుకొని ఇలా కలుషిత ఫుడ్స్ అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకున్న.. కనీస శుభ్రత లేకుండా ఐస్ క్రీం తయారు చేస్తోన్న ఫ్యాక్టరీలలో తనిఖీలు జరపాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.