భోజన ప్రియులకు షాకింగ్ న్యూస్.. నోరూరించే ఈ బోటీ.. తిన్నారంటే పోతారు..!
ఇది కల్తీకాలం..! నిత్యం మనం తినేది, తాగేదీ ప్రతిదీ కల్తీ..! చివరకు కూరలో వేసుకునే కారం, పసుపూ కల్తీనే..! ఇలా ఒక్కటేంటి.. ఎందెందు వెతికినా అందందే కల్తీ దందా కనిపిస్తోంది. దీంతో ప్రజలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఏం కొనాలో..ఏం తినాలో తెలియని పరిస్థితి దాపురించింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలతో హడలెత్తిస్తున్నా కల్తీగాళ్ల వక్రబుద్ది మారట్లేదు.

ఇది కల్తీకాలం..! నిత్యం మనం తినేది, తాగేదీ ప్రతిదీ కల్తీ..! చివరకు కూరలో వేసుకునే కారం, పసుపూ కల్తీనే..! ఇలా ఒక్కటేంటి.. ఎందెందు వెతికినా అందందే కల్తీ దందా కనిపిస్తోంది. దీంతో ప్రజలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఏం కొనాలో..ఏం తినాలో తెలియని పరిస్థితి దాపురించింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలతో హడలెత్తిస్తున్నా కల్తీగాళ్ల వక్రబుద్ది మారట్లేదు. అధిక లాభాల కోసం జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో మరోసారి భారీ మోసం వెలుగుచూసింది.
మార్చి 21, శుక్రవారం డబీర్‌పురాలోని ఒక దుకాణంలో సోదాలు చేసిన టాస్క్‌ఫోర్స్ అధికారుల మైండ్ బ్లాక్ అయ్యింది. మటన్ షాపులో పెద్ద మొత్తంలో చెడిపోయిన బోటీనీ స్వాధీనం చేసుకున్నారు. బోటీ అంటే.. మేక లేదా గొర్రె వంటి జీవాల గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, మెదడు వంటి అంతర్గత అవయవాలు. డబీర్‌పురాలో చెడిపోయిన జంతు మాంసాన్ని అమ్ముతున్నారనే సమాచారం మేరకు పోలీసులు, పశువైద్య శాఖ అధికారులు సోదాలు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. హోల్‌సేల్ మార్కెట్ నుంచి చౌక ధరలకు చెడిపోయిన బోటీని కొని నగరంలోని పలు బార్లు, రెస్టారెంట్స్ వంటి వాటికి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ వారం ప్రారంభంలో కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు మంగళ్‌హాట్, పురానాపూల్, జియాగూడలలో కూడా దాడి చేసి, పెద్ద మొత్తంలో చెడిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళ్‌హాట్‌లో మార్చి 19 బుధవారం నాడు సౌత్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ కమిషనర్, GHMC వెటర్నరీ డాక్టర్‌తో కలిసి జరిపిన దాడిలో 12 టన్నుల గొర్రెలు, మేకల మాంసం స్వాధీనం చేసుకున్నారు.
ఇక తాజాగా ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారాల కొద్దీ నిల్వ ఉంచినటువంటి మాంసం వల్ల ప్రమాదకర రోగాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..