Miryalaguda MLA: మర్యాద తప్పితే డ్యాన్స్ చేయిస్తా.. సొంత నియోజకవర్గ ప్రజలకు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు వార్నింగ్
తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు కోపంతో ఊగిపోయారు. తన సొంత నియోజకర్గ ప్రజలనే హెచ్చరించారు. మర్యాద తప్పితే డ్యాన్స్ చేయిస్తానంటూ ఘాటుగా హెచ్చరించారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుకు కోపం వచ్చింది. సొంత నియోజకవర్గ ప్రజలకే వార్నింగ్ ఇచ్చారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రభుత్వ పథకాలు తీసుకోకూడదంటూ హుకూం జారీ చేశారు. అన్నం పెట్టే వారికి సున్నం పెడుతున్నారంటూ మండిపడ్డారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం నర్సాపూర్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు MLA భాస్కర్‌రావు. అక్కడికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లడిన ఆయన.. మర్యాదగా ఉన్నంత వరకే మర్యాదగా ఉంటనంటూ హెచ్చరించారు.
తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రభుత్వ పథకాలు తీసుకోకూడదంటూ ఎమ్మెల్యే భాస్కర్‌రావు హుకుం జారీ చేశారు. మర్యాద తప్పితే డ్యాన్స్ చేయిస్తానంటూ సొంత నియోజకవర్గం ప్రజలను ఘాటుగా హెచ్చరించారు. ఇదిలావుంటే, ఎమ్మెల్యే భాస్కర్ రావు తీరుపై గ్రామస్థులు, ఇతర పార్టీల నేతలు మండిపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం