Formula E Hyderabad: రేస్ కు రెడీ అవుతున్న హైదరాబాద్.. షెడ్యూల్, టికెట్ల బుకింగ్ వివరాలు..

హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు రేసింగ్ సర్క్యూట్ లో ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ నకు సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ల రేస్ జరగనుంది. ఇందులో 11 జట్టు పాల్గొంటున్నాయి.

Formula E Hyderabad: రేస్ కు రెడీ అవుతున్న హైదరాబాద్.. షెడ్యూల్, టికెట్ల బుకింగ్ వివరాలు..
Formula E
Follow us
Madhu

|

Updated on: Feb 07, 2023 | 5:00 PM

రేసింగ్ ప్రియులకు శుభవార్త.. పార్ములా ఈ రేసింగ్ మొట్టమొదటి సారిగా భారతదేశంలో నిర్వహించేందుకు అంతా సిద్ధమవుతోంది. దీనికి హైదరాబాద్ వేదిక కానుంది. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు రేసింగ్ సర్క్యూట్ లో ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ నకు సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ల రేస్ జరగనుంది. ఇందులో 11 జట్టు పాల్గొంటున్నాయి. మన దేశానికి చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా కు చెందిన ఈ రేసింగ్ టీమ్ తొలిసారిగా తన హోం గ్రౌండ్ లో పోటీ పడనుంది. ఇది ఎలక్ట్రిక్ కార్ల కోసం ఏర్పాటు చేసిన రేసింగ్. దీనిలో సింగిల్ సీటర్ మోటర్ స్పోర్ట్ కారులు వినియోగిస్తారు. దీనిని ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఎల్ ఆటోమొబైల్(ఎఫ్ఐఏ) 2023 హైదరాబాద్‌ ఈ ప్రిక్స్ (E-prix) పేరుతో నిర్వహిస్తోంది. ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ నిర్వహించడానికి ఎఫ్ఐఏ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. ఈ రేసు అధికారిక ప్రమోటర్ గా ఏస్ ఎన్ఎక్స్ టీ జెన్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రేసును దగ్గరగా చూడాలని చాలా మంది ఆశపడతారు. అటువంటి వారి కోసమే ఈ కథనం.. ఫార్ములా ఈ రేసింగ్ షెడ్యూల్, టికెట్లు వంటి వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారం..

ఫార్ములా E హైదరాబాద్ ట్రాక్..

పూర్తి పర్యావరణ హితంగా నిర్వహిస్తున్న ఈ రేసులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 11 జట్లు పాల్గొంటున్నాయి. హైదరాబాద్‌లో చాంపియన్ షిప్ సీజన్ 9లో నాలుగో రౌండ్‌గా జరగనుంది. సిటీ సెంటర్లకు రేసింగ్‌ను తీసుకురావాలనే ఫార్ములా E లక్ష్యానికి అనుగుణంగా, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లేక్‌ చుట్టూ ఉన్న స్ట్రీట్ సర్క్యూట్‌లో రేస్ నిర్వహిస్తున్నారు. ఈ సర్క్యూట్ 2.835-కిమీ ఉంటుంది. సర్క్యూట్ లుంబినీ పార్క్ గుండా తిరుగుతుంది. మొత్తం 18 మలుపులను కలిగి ఉంటుంది.

ఫ్యాన్ విలేజ్..

ఈ సర్క్యూట్ లో కేవలం రేసింగ్ ట్రాక్ మాత్రమే కాక, మహీంద్రా, ఫార్ములా E వంటి తయారీదారుల ప్రదర్శనలతో సహా అనేక రకాల కార్యకలాపాలకు ఆతిథ్యం ఇచ్చే అలియన్జ్ ఫ్యాన్ విలేజ్ కూడా ఉంటుంది. గేమింగ్ అరేనా, కిడ్స్ జోన్, ఫుడ్ అండ్ బెవరేజ్ కౌంటర్లు స్టేజ్ యాక్ట్‌లు కూడా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

టికెట్లు ఇలా..

వేదికలో దాదాపు 20,000 మంది ప్రేక్షకులకు అనుమతి ఉంటుంది. వివిధ ధరల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రూ. 1,000 , రూ. 4,000 విలువైన గ్రాండ్ స్టాండ్ టికెట్లు మొత్తం ఇప్పటికే అమ్ముడయ్యాయి. కాగా ప్రీమియం గ్రాండ్‌స్టాండ్ (రూ. 7,000), ఏస్ గ్రాండ్‌స్టాండ్ (రూ. 10,500) టిక్కెట్‌లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. 1.25 లక్షలకు ఏస్ లాంజ్ ప్యాకేజీ కూడా ఉంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలు చేయాల్సి ఉంది.

షెడ్యూల్ ఇలా..

ఫిబ్రవరి 10: ప్రాక్టీస్-1.. 16:25 నుండి 17:25 వరకు

ఫిబ్రవరి 11: ప్రాక్టీస్ -2.. 8:05 నుండి 8:55 వరకు

ఫిబ్రవరి 11: క్వాలిఫైయింగ్.. 10:40 నుండి 11:55 వరకు

ఫిబ్రవరి 11: డ్రైవర్స్ పరేడ్.. 13:40 నుండి 13:55 వరకు

ఫిబ్రవరి 11: రేసు.. 15:00 నుండి 16:30 వరకు

మరిన్ని స్పోర్ట్స్  వార్తల కోసం క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు