IND Vs AUS: ‘కోహ్లీ’ టెక్నిక్‌తో నెంబర్‌వన్.. కట్ చేస్తే.. ఈ ఆసీస్ ప్లేయర్‌తోనే టీమిండియాకు డేంజర్!

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ మార్నస్ లబూషేన్ ప్రస్తుతం టెస్టు ఫార్మాట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. స్వదేశీ పిచ్‌లపైనే కాకుండా..

IND Vs AUS: 'కోహ్లీ' టెక్నిక్‌తో నెంబర్‌వన్.. కట్ చేస్తే.. ఈ ఆసీస్ ప్లేయర్‌తోనే టీమిండియాకు డేంజర్!
Marnus Labuschagne
Follow us

|

Updated on: Feb 07, 2023 | 4:33 PM

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ మార్నస్ లబూషేన్ ప్రస్తుతం టెస్టు ఫార్మాట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. స్వదేశీ పిచ్‌లపైనే కాకుండా విదేశాల్లోనూ తన బ్యాట్‌తో ప్రతాపం చూపించాడు. ఇక లబూషేన్ అగ్రస్థానానికి చేరుకోవడంలో టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడట.! ఇది మీలో ఎవరికైనా తెలుసా.? అవునండీ.. కోహ్లీ కారణంగానే లబూషేన్ తనలోని అతి పెద్ద బలహీనతను అధిగమించి నెంబర్‌వన్‌గా నిలిచాడు. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ ఆటగాడు టీమిండియా ముందు పొంచి ఉన్న ప్రమాదం.

ఈ టోర్నమెంట్‌లో లబూషేన్ ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడు. ప్రతి మ్యాచ్‌.. ప్రతి ఇన్నింగ్స్‌లోనూ అతడి వికెట్ టీమిండియాకు చాలా కీలకం. గత ఏడాది కాలంగా ఈ బ్యాట్స్‌మెన్ ఏ జట్టును వీడలేదు. తనదైన బ్యాటింగ్ శైలితో ప్రత్యర్ధి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇక బౌలర్లకు అతడి బ్యాటింగ్ టెక్నిక్‌లో తప్పు కనిపెట్టడం చాలా కష్టం. విరాట్ కోహ్లీ కారణంగానే తన బ్యాటింగ్‌లో ఉన్న అతిపెద్ద లోపాన్ని సరిదిద్దుకున్నాడట లబూషేన్. ఈ విషయాన్ని అతడి కోచ్ స్వయంగా వెల్లడించాడు. అంతర్జాతీయ అరంగేట్రానికి ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మార్నస్ లబూషేన్‌కు లెగ్ సైడ్ బ్యాటింగ్‌లో వీక్‌గా ఉండేవాడు. అతడు లెగ్ సైడ్ షాట్లు ఆడిన ప్రతీసారి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగేవాడు.

‘నాకు ఔట్ కావడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఈ భయం వల్ల లెగ్ సైడ్ ఆడడం కూడా మానేశాను. ఇక ఆ భయాన్ని నా దగ్గర నుంచి పోగొట్టేందుకు కోచ్ నీల్ దికోస్టా ఒక ప్రత్యేక శిక్షణా కసరత్తు చేయించాడు. దానికి ‘విరాట్ కోహ్లీ’ అని పేరు పెట్టాడు. ఔట్ సైడ్ ఆఫ్ నుంచి ఆన్ సైడ్‌కు బంతిని ఎలా విరాట్ కోహ్లీ ఆడగలడో.. అతడు నేర్పించాడు. అయితే అప్పటికీ ఎల్బీడబ్ల్యూ అవుతానని భయం ఉండేది. విరాట్ కోహ్లి కొట్టిన షాట్ ఆడలేనని, ఔట్ అవుతానని చెబుతుండేవాడిని. అయితే ఇప్పుడు ఆడకపోతే.. ఇంకెప్పుడూ నువ్వు నీ సత్తాను నిరూపించుకోలేవ్’ అని కోచ్ అన్నాడు. ఇక మార్నస్ తన టెక్నిక్‌పై నమ్మకం ఉంచి కష్టపడి ప్రతీ షాట్ నేర్చుకున్నాడు. ఇక ఇప్పుడు మైనస్ అనేది లేకుండా టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.