Australian Open 2023: వింబుల్డన్ ఛాంపియన్‌కు భారీషాకిచ్చిన బెలారస్ బ్యూటీ.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో కొత్త ఛాంపియన్‌గా సబలెంక..
Aryna Sabalenka Won Australian Open 2023: బెలారస్‌కు చెందిన అరినా సబలెంకా ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన ఎలెనా రిబాకినాపై విజయం సాధించింది. సబలెంకాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్.
Aryna Sabalenka Won Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ విజేతగా బెలారస్‌కు చెందిన అరినా సబలెంక నిలిచింది. నిన్న జరిగిన ఫైనల్‌లో ఐదో సీడ్ సబలెంక, కజకిస్తాన్‌కు చెందిన రిబకినాపై విజయాన్ని సాధించింది. 4-6, 6-3, 6-4 తేడాతో రిబకినాపై సబలెంక విజయం సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ కొత్త ఛాంపియన్ అరీనా సబలెంక. గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో తొలిసారి ఫైనల్ చేరిన ఈ 24 ఏళ్ల అమ్మాయి.. తొలి సెట్ కోల్పోయినా తిరిగి పుంజుకుని టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. తుదిపోరులో ఈ ఐదో సీడ్ క్రీడాకారిణి 4-6, 6-3, 6-4 తేడాతో కజకిస్తాన్‌కు చెందిన వింబుల్డన్ ఛాంపియన్ రిబకినాపై విజయం సాధించింది.
గంటకు 190 కిలోమీటర్లకు పైగా వేగంతో సర్వ్‌లు, ఒకరిని మించి మరొకరు.. ఏస్‌లు, కళ్లు చెదిరే విన్నర్లతో ఇద్దరూ సివంగుల్లా తలపడ్డారు. కానీ, తొలి సెట్‌లో ఆధిపత్యం రిబకినాదే. మూడో గేమ్‌లో ప్రత్యర్థి అనవసర తప్పిదంతో బ్రేక్ పాయింట్ సాధించిన రిబకినా, ఆపై 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఎనిమిదో గేమ్‌లో బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో తొలి బ్రేక్ పాయింట్ సాధించిన సబలెంక 4-4తో స్కోరు సమం చేసింది. కానీ, తర్వాతి గేమ్‌లో డబుల్ ఫాల్ట్‌తో సర్వీస్ కోల్పోవడం ఆమెను దెబ్బతీసింది. పదో గేమ్‌లో సర్వీస్ నిలబెట్టుకున్న రిబకినా తొలి సెట్ నెగ్గింది.
ఇక రెండో గేమ్‌లో సబలెంక దూకుడు ప్రదర్శించింది. ఏస్‌లు, విన్నర్లతో విరుచుకుపడింది. ప్రధానంగా బ్యాక్‌హ్యాండ్ షాట్లతో అలరించింది. చూస్తుండగానే 4-1తో దూసుకెళ్లింది. అదే ఊపులో వరుసగా రెండు ఏస్‌లతో రెండో సెట్‌ను నెగ్గింది. మూడో సెట్ కూడా హోరాహోరీగా సాగింది. స్కోరు 3-3తో సమానమైన దశలో బ్రేక్ పాయింట్ సాధించడం సబలెంకకు కలిసొచ్చింది. తర్వాతి గేమ్‌నూ సొంతం చేసుకున్న ఆమె 5-3తో పైచేయి సాధించింది. ఆ వెంటనే రిబకినా ఓ గేమ్ నెగ్గినా..పదో గేమ్‌లో పట్టువదలకుండా పోరాడిన సబలెంక సెట్‌తో పాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది.
సింగిల్స్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన సబలెంక జాతీయ పతాకంతో సంబరాలు చేసుకోలేకపోయింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యా, బెలారస్ ప్లేయర్లను ఈ గ్రాండ్‌స్లామ్‌లో ఆయా దేశాల తరపున ప్రాతినిథ్యం వహించకుండా నిషేధించారు. ఐతే వీళ్లు తటస్థ ప్లేయర్లుగా పోటీపడొచ్చు. ఇప్పుడు బెలారస్‌కు చెందిన సబలెంక.. ఇలాగే బరిలో దిగి విజేతగా నిలిచింది. దీంతో టెన్నిస్ చరిత్రలో తటస్థ క్రీడాకారిణిగా ఆడి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన తొలి ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్. ఈ ఏడాది ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ ఒక్క సెట్ కూడా కోల్పోకుండా గెలిచిన సబలెంక ఒకవైపు. టాప్‌సీడ్ స్వైటెక్‌తో సహా అగ్రశ్రేణి క్రీడాకారిణిలను ఓడించి తుదిపోరు చేరిన రిబకినా మరోవైపు. ఈ టోర్నీలో ఇద్దరికీ ఇదే తొలి ఫైనల్. పోరు మొదలైంది. గంటకు 190 కిలోమీటర్లకు పైగా వేగంతో సర్వ్‌లు, ఒకరిని మించి మరొకరు.. ఏస్‌లు, కళ్లు చెదిరే విన్నర్లతో సివంగుల్లా తలపడ్డారు. తొలి సెట్ రిబకినాదే. తొలి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కోసం సబలెంకాకు నిరీక్షణ తప్పదేమోనన్న అంచనాలు. కానీ బెలారస్ భామ వదల్లేదు. తర్వాతి రెండు సెట్లలో అద్భుతమైన ఆటతీరుతో.. ఘనంగా గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ బోణీ కొట్టింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..