నాడు చెత్త ఆటో.. నేడు ప్యాసింజర్ ఆటో.. గుర్తు పట్టుకుండా తిరుగుతున్న ఎమ్మెల్యే.. ఎందుకంటే?
సాధారణంగా ప్రజా ప్రతినిధి అనగానే మంది మార్బలంతో హంగామా చేస్తుంటారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులతో ఏసి రూముల్లో సమీక్షలు నిర్వహిస్తుంటారు. కానీ ఆ ఎమ్మెల్యే రూటే.. సపరేటు. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు ఆయన సామాన్యుడిలా అవతారం ఎత్తారు. ఆ ఎమ్మెల్యే ఎవరు..? ఆయన ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

సాధారణంగా ప్రజా ప్రతినిధి అనగానే మంది మార్బలంతో హంగామా చేస్తుంటారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులతో ఏసి రూముల్లో సమీక్షలు నిర్వహిస్తుంటారు. కానీ ఆ ఎమ్మెల్యే రూటే.. సపరేటు. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు ఆయన సామాన్యుడిలా అవతారం ఎత్తారు. ఆ ఎమ్మెల్యే ఎవరు..? ఆయన ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి జిల్లా వాణిజ్య కేంద్రంగా పేరు ఉంది. రైస్ ఇండస్ట్రీస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మిర్యాలగూడ పట్టణంలో ఆసియా ఖండంలోనే అత్యధికంగా రైస్ మిల్లులు ఉన్నాయి. ఈ పట్టణానికి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో మిర్యాలగూడ పట్టణంలో దీర్ఘకాలంగా వేధిస్తోన్న ట్రాఫిక్ సమస్యతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ట్రాఫిక్ జామ్, ప్రమాదాల నివారణకు ప్రధాన రహదారిపై డివైడర్ ను నిర్మించడంతోపాటు ప్రధాన కూడళ్లును మూసివేశారు. డివైడర్లు, యూటర్న్ లు, మూసివేసిన కూడళ్లతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువయ్యాయనే చర్చ పట్టణంలో జరిగింది.
ఈ నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వినూత్నంగా స్పందించారు. అధికారిక వాహనాలను పక్కన పెట్టి, సామాన్య పౌరుడిలా లోకల్ ఆటోలో ప్రయాణించి క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ప్రధాన కూడళ్లలో వాహనాల రద్దీ, అస్తవ్యస్తంగా ఉన్న పార్కింగ్, రహదారుల ఆక్రమణల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే, నేరుగా ఆటో ఎక్కి పట్టణమంతా తిరిగారు. ప్రధానంగా సాగర్ రోడ్, హనుమాన్ పేట ఫ్లైఓవర్,మార్కెట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎందుకు నిలిచిపోతుందో వాహన దారులు,పాదచారులను అడిగి తెలుసుకున్నారు. ఆటో కార్మికుల సమస్యలను,నిబంధనల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను వారితో ముఖాముఖి చర్చించి తెలుసుకున్నారు.
గతంలో కూడా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఖాకీ చొక్కా ధరించి, పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. మున్సిపల్ కార్యాలయం నుంచి నేతాజీ కూరగాయల మార్కెట్, గాంధీ నగర్ వరకు చెత్త తరలించే ట్రాలీ ఆటోను నడుపుకుంటూ వెళ్లి చెత్తను సేకరించారు.
మొత్తానికి పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే తీసుకున్న చొరవ పట్ల స్థానిక ప్రజలు,వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు ఏసీ రూముల్లో కాకుండా ఇలా రోడ్ల మీదకు వచ్చి సమస్యలు తెలుసుకోవడం శుభపరిణామమని కొనియాడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
