AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలోనూ గుత్తులు గుత్తులుగా మల్లెపూలు.. కిచెన్‌లో ఉండే ఇదొక్కటి వేస్తే చాలు..

మల్లె మొక్కలు వర్షాకాలంలో కూడా విరివిగా పూలు పూయాలంటే సరైన ఎండ, సమయానికి పోషకాలు, తగిన సంరక్షణ చాలా ముఖ్యం. టీ పొడి, చాక్ పీస్ పౌడర్, నిమ్మరసంతో ఇంట్లోనే తయారు చేసుకునే సులభమైన ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ను ప్రతి 15 రోజులకు ఒకసారి అందిస్తే మొక్కలకు నైట్రోజన్, కాల్షియం వంటి పోషకాలు లభించి మొగ్గలు ఎక్కువగా వచ్చి పూలు సమృద్ధిగా పూయడానికి సహాయపడుతుందని గార్డెనింగ్ నిపుణులు చెబుతున్నారు.

వర్షాకాలంలోనూ గుత్తులు గుత్తులుగా మల్లెపూలు.. కిచెన్‌లో ఉండే ఇదొక్కటి వేస్తే చాలు..
Jasmine Plant Care Tips
Shaik Madar Saheb
|

Updated on: Jul 19, 2026 | 12:02 PM

Share

సాధారణంగా అందరి ఇళ్లల్లో పూల మొక్కలు, పండ్ల చెట్లు ఉంటాయి.. ముఖ్యంగా.. ఇంటి అందానికి అలాగే మంచి సువాసనకు మల్లె మొక్కలను చాలా మంది పెంచుకుంటారు. అయితే.. మల్లె మొక్కలు సాధారణంగా ఎండాకాలంలో ఎక్కువగా పూలు పూస్తాయి. అయితే కొన్ని సులభమైన చిట్కాలు, సరైన పోషకాలను అందించడం ద్వారా ఈ వర్షాకాలం అంతా కూడా మల్లె మొక్కల నుండి నిండుగా పువ్వులను పొందవచ్చు. కొంతమంది చెప్పే గార్డెన్ టిప్స్ ఆధారంగా, ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఒక పవర్‌ఫుల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారీ విధానం.. మల్లె మొక్కల సంరక్షణ.. పూలు బాగా పూయడానికి ఏం చేయాలి..? అనే విషయాలను ఈ తెలుసుకుందాం..

మల్లె మొక్కల సంరక్షణకు ముఖ్యమైన నియమాలు:

ఎండ తగలడం: మల్లె మొక్కలు బాగా పూలు పూయాలంటే వీటికి ఎండ చాలా అవసరం. రెండు సంవత్సరాల నుండి ప్రూనింగ్ (కొమ్మలు కత్తిరించడం) చేసినా పూలు పూయడం లేదంటే దానికి ప్రధాన కారణం ఎండ తగలకపోవడమే కావచ్చు. ఈ వర్షాకాలంలో కూడా మొక్కలను పూర్తి సూర్యరశ్మి (Full Sunlight) తగిలే ప్రదేశంలో ఉంచాలి.

హెవీ ఫీడర్ ప్లాంట్స్: మల్లె మొక్కలకు ఎక్కువ పోషకాలు అవసరమవుతాయి. వీటికి ఎంత బాగా ఫీడింగ్ (ఎరువులు/ఫెర్టిలైజర్స్) అందిస్తే, అంత చక్కగా, ఎక్కువగా పువ్వులు పూస్తాయి. సన్నని కొమ్మలు ఉన్న చిన్న మొక్కలు సైతం సరైన పోషకాలు అందిస్తే విరివిగా పూలు పూస్తాయి.

ఇవి కూడా చదవండి

రెస్టింగ్ పీరియడ్: వర్షాకాలం ముగిసే వరకు మల్లె మొక్కలు చక్కగా పూలు పూస్తాయి. ఆ తర్వాత చలికాలంలో ఇవి రెస్టింగ్ (డార్మెన్సీ) పీరియడ్‌లోకి వెళ్తాయి. మళ్లీ ఫిబ్రవరి నెలలో ప్రూనింగ్ స్టార్ట్ చేసుకుని సంరక్షించుకోవాలి.

హోం మేడ్ పవర్‌ఫుల్ ఫెర్టిలైజర్ తయారీ విధానం:

ఈ ఫెర్టిలైజర్ వర్షాకాలంలో మల్లె మొక్కల ఎదుగుదలకు, మొగ్గలు తొడగడానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది.

కావలసిన పదార్థాలు:

ఒక లీటర్ నీరు

ఒక స్పూన్ ఫ్రెష్ టీ పౌడర్ (Tea Powder)

ఒక స్పూన్ చాక్ పీస్ పౌడర్ (Chalk Piece Powder)

8 నుండి 10 చుక్కల నిమ్మరసం (Lemon Juice)

తయారు చేసే విధానం:

ఒక లీటర్ నీటిలో ఒక స్పూన్ ఫ్రెష్ టీ పౌడర్‌ను వేసి, ఒక రోజు ముందే (24 గంటలు) నానబెట్టుకోవాలి. దీనివల్ల టీ పొడి నీటిలో బాగా ఫర్మెంట్ అయ్యి, నీరు మంచి రంగులోకి మారుతుంది.

మరుసటి రోజు ఈ ఫెర్టిలైజర్‌ను మొక్కలకు ఇచ్చే ముందు, ఆ నీటిలో ఒక స్పూన్ చాక్ పీస్ పౌడర్ 8 నుండి 10 చుక్కల నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొక్కలకు అందించే పవర్‌ఫుల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ సిద్ధమవుతుంది.

ఈ ఫెర్టిలైజర్ వల్ల కలిగే ప్రయోజనాలు:

టీ పౌడర్ (నైట్రోజన్): టీ పొడి నానబెట్టిన నీటిలో నైట్రోజన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మొక్క ఆకులు పచ్చగా ఉండటానికి, కొమ్మలు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

చాక్ పీస్ పౌడర్ (కాల్షియం): ఇందులో ఉండే కాల్షియం మల్లె మొక్కలకు చాలా అవసరం. కాల్షియం లభించడం వల్ల మొక్కలకు ఎక్కువ మొగ్గలు తొడిగి, పువ్వులు పెద్ద సైజులో, ఎక్కువగా పూస్తాయి.

నిమ్మరసం (అసిడిక్ సాయిల్): నిమ్మరసం కలపడం వల్ల కుండీలోని మట్టి అసిడిక్ (ఆమ్ల గుణం) గా మారుతుంది. సాధారణంగా పూల మొక్కలకు అసిడిక్ సాయిల్ అంటే చాలా ఇష్టం. మట్టి ఇలా మారినప్పుడు మొక్కలు పోషకాలను వేగంగా గ్రహించి ఎక్కువ పూలను ఇస్తాయి.

ఎలా ఉపయోగించాలి?

ఈ ఫెర్టిలైజర్‌ను మొక్కలకు ఇచ్చే ముందే, కుండీలోని మట్టిని నార్మల్ వాటర్ తో కొద్దిగా తడిపి ఉంచాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న లిక్విడ్ ఫెర్టిలైజర్‌ను మొక్కల మొదళ్లలో సరిపడినంత పోయాలి. ఈ హోం మేడ్ ఫెర్టిలైజర్‌ను ప్రతి 15 రోజులకు ఒకసారి మల్లె మొక్కలతో పాటు తోటలోని అన్ని రకాల పూల మొక్కలకు కూడా ఇస్తూ ఉంటే, వర్షాకాలం అంతా మీ తోట పూల సువాసనలతో నిండిపోతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us