AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fresh Fish: అరెరే ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. తాజా చేపలను గుర్తించడం ఇంత సింపులా..

నాన్‌వెజ్ లవర్స్‌లో చేపలు తినే వారు మాత్రం ప్రత్యేకంగా ఉంటారు. వీరికి సండే వచ్చిదంటే చాలు కచ్చితంగా ఇంట్లో చేపల కూర ఉండాల్సిందే. అందుకే ఆదివారం రాగానే వీరు చాపలు కొనేందుకు మార్కెట్‌కు పరుగులు పెడతారు. దొరికన చేపలను పట్టుకొని ఇంటికెళ్తారు. కానీ చాలా ఇప్పటి వరకు తాజా చేపలను ఎలా గుర్తించాలో తెలియదు. కాబట్టి మార్కెట్‌లో చేపలు కొన్నేప్పుడు తాజాగా వాటిని ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Jul 19, 2026 | 11:53 AM

Share
చేప కళ్ళు: మీరు కొనే చేపలు తాజాగా లేదా అనేది తెలుసుకోవడానికి కొన్ని సింపుల్‌ మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒక వాటి కళ్లు. తాజాగా ఉన్న చేప కళ్ళు అద్దంలా స్పష్టంగా, మెరుస్తూ, కొద్దిగా ముందుకు ఉబ్బినట్లు కనిపిస్తాయి. అదే చేప కళ్ళు లోపలికి ముడుచుకుని, రక్తం కారినట్లు లేదా మసకగా తెల్లటి పొరతో కనిపిస్తే.. అది కచ్చితంగా కెమికల్స్ వేసి చాలా రోజులు నిల్వ ఉంచిన చేప అని అర్థం చేసుకోండి. ఎట్టిపరిస్థితుల్లో అలాంటి చేపలను కొనకండి.

1 / 5
శరీర గట్టిదనం: మీరు చేపను కొనేప్పుడు దాన్ని శరీరంపై వేలితో నొక్కి చూడండి.. మీరు చేప శరీరాన్ని వేలితో నొక్కినప్పుడు, ఆ భాగం వెంటనే మామూలు స్థితికి వస్తే ఆ తాగా చేప అని అర్థం. ఒక వేళ వేలితో నొక్కిన చోట గుంత పడి, మాంసం మెత్తగా ఉంటే అది పాడైపోయిన చేప అని అర్థం. అలాంటి వాటిని కూడా మీరు అస్సలు కొనవద్దు.

2 / 5
పిల్కలు: తాజాగా చేపలు గుర్తుపట్టేందుకు ఇది కూడా మంచి పద్దతి.. తాజా చేపలకు తల భాగంలో ఉండే పిల్కల కింద ఎప్పుడూ రక్తపు ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటాయి.. అలా కాకుండా అవి గోధుమ లేదా ముదురు బూడిద రంగులో ఉంటే ఆ చేపలు ఎక్కువ రోజులు స్టోర్ చేసినవి అర్థం.

3 / 5
వాసన: సముద్రం లేదా నది నుండి అప్పుడే పట్టిన తాజా చేపల ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటాయి. వాటి నుండి సముద్రపు నీరు లేదా ఉప్పు గాలి వంటి వాసన వస్తుంది కాబట్టి మీరు అలాంటి వాటినే కొనేందుకు ట్రై చేయండి. అలా కాకుండా, చేపల నుండి ఘాటైన అమ్మోనియా వాసన లేదా కుళ్లిన దుర్వాసన వస్తే వాటిని అస్సలు కొనకండి.

4 / 5
అలాగే తాజా చేప చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. పొలుసులు శరీరానికి గట్టిగా అంటుకుని ఉంటాయి. పాత చేప అయితే రంగు వెలిసిపోయి ఉంటుంది. అలాంటి వాటిని కొనవద్దు. కాబట్టి ఇకపై మీరు మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఈ 5 చిట్కాలను గుర్తుపెట్టుకొని చేపలను కొనండి.

5 / 5
Follow Us