అరటి పండు ఎందుకు పవిత్రమైనది? అసలు రహస్యం ఇదే
19 July 2026
TV9 Telugu
TV9 Telugu
పూజ, వ్రతం, పెళ్లి, పేరంటం.. ఇలా మన ఆచారాలూ సంప్రదాయాల్లో అరటిపండుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండ్లను శుభసూచకంగా భావిస్తారు
TV9 Telugu
భగవంతుడికి సమర్పించడానికి ఇతర పండ్లు ఎన్నున్నా.. అరటిపండు తప్పనిసరిగా ఉంటుంది. పైగా ఇవి అన్ని కాలాల్లోనూ లభిస్తాయి
TV9 Telugu
సపోటా, శీతాఫలం వంటి పండ్లలో గుజ్జు తిని గింజలను పడేస్తాం. అలా పారేసిన విత్తనాలు మళ్లీ మొలకెత్తి వృక్షాలై.. తిరిగి పండ్లను ఇస్తాయి
TV9 Telugu
అంటే ఎంగిలి విత్తనాల నుంచి వచ్చిన చెట్ల ఫలాలను మనం ఆరగిస్తాం. దేవుడికి కూడా నివేదిస్తాం. కానీ, అరటిపండు అలా కాదు
TV9 Telugu
పూర్తిగా తినేస్తాం కాబట్టి గింజలు పారేయడం, తిరిగి మొలకెత్తడం ఉండదు. పిలక మొక్కల ద్వారా అరటితోట వృద్ధి చెందుతుంది
TV9 Telugu
ఈ కారణం వల్ల అరటిపండును దేవునికి సమర్పించడం శ్రేష్టమని, ఇది పూర్ణఫలమని పెద్దలు చెబుతారు. పండుతోపాటు ఆకులూ పవిత్రమైనవే
TV9 Telugu
అరటిచెట్టు ప్రతిభాగం ఏదో విధంగా పూజకి ఉపయోగపడుతుంది. అతి తక్కువ కాలంలోనే ఫలాలను అందిస్తుంది
TV9 Telugu
అరటిపండ్లను ఆరగించినా పిలకల ద్వారా మొక్కలు వస్తూంటాయి. పూర్ణఫలంగా భావించే అరటిపండును దేవుడికి నివేదించి.. ప్రసాదంగా ఇవ్వడం, తాంబూలంలో చేర్చడం పుణ్యప్రదం
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్
కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?
పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి