AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: అన్నా.. వదినకు ఏ చీర తీసుకున్నారు? నాగ చైతన్య ఆసక్తికర సమాధానం.. వీడియో ఇదిగో

టాలీవుడ్ లో ది మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ లో నాగార్జున-శోభిత ధూళిపాళ్ల జంట ఒకటి. తాజాగా ఈ దంపతులు ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కలిసి వెళ్లారు. ఇక్కడ ఒక అభిమాని నుంచి హీరో నాగ చైతన్యకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

Naga Chaitanya: అన్నా.. వదినకు ఏ చీర తీసుకున్నారు? నాగ చైతన్య ఆసక్తికర సమాధానం.. వీడియో ఇదిగో
Naga Chaitanya, Sobhita Dhulipala
Basha Shek
|

Updated on: Jul 19, 2026 | 12:07 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ లో ది బెస్ట్ అండ్ రొమాంటిక్ కపుల్ అంటే నాగార్జున-శోభిత ధూళిపాళ్ల జంటే అని చెప్పవచ్చు. 2024లో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన వీరు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్నారు. అటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ, ఇటు పర్సనల్ లైఫ్ లోనూ ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఓ వైపు హీరోగా అక్కినేని నాగార్జున వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. మరోవైపు శోభిత కూడా అప్పుడప్పుడు వెండితెరపై కనిపిస్తోంది. తాజాగా ఈ లవ్లీ కపుల్ హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కలిసి వెళ్లారు. బోడుప్పల్‌, పీర్జాదిగూడలో కొత్తగా ఏర్పా టు చేసిన షాపింగ్ మాల్ ను తమ చేతుల మీదుగా ప్రారంభించారు. నాగ చైతన్య- శోభిత కలిసి రావడంతో వీరిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు తెగ పోటీ పడ్డారు. ఇదే క్రమంలో అభిమానులు నాగ చైతన్యనను ఒక ఆసక్తికర ప్రశ్న అడిగారు. ‘అన్నా.. వదిన కోసం ఏ చీర తీసుకుంటారు’ అని చైతూను అడిగారు. దీనికి సిగ్గు పడిపోయిన అక్కినేని హీరో.. ‘తను ఏది ఎంచుకుంటే… అదే తీసుకుంటాను’ అని నవ్వుతూ చెప్పాడు. చైతన్య ఆన్సర్ విన్న శోభిత కూడా నవ్వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ‘బెస్ట్ కపుల్’, ‘లవ్లీ కపుల్’ అంటూ నాగ చైతన్య- శోభితల జోడీకి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. తండేల్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన నాగ చైతన్య లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం అతను వృష కర్మ సినిమాతో బిజీగా ఉంటున్నాడు. విరూపాక్ష సినిమా ఫేమ్ కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సినిమా పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో నాగ చైతన్య, శోభిత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us