AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC 2026 : 164 పరుగులకే ఆలౌట్ అయినా తగ్గేదేలే.. మొదటిసారి MLC 2026 ముద్దాడిన షారుఖ్ ఖాన్ టీం

MLC 2026 : మేజర్ లీగ్ క్రికెట్ 2026 ఫైనల్లో షారుఖ్ ఖాన్‌కు చెందిన లాస్ ఎంజిల్స్ నైట్ రైడర్స్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్‌పై 1 పరుగుతో విజయం సాధించి తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో జట్టు పేరిట పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి.

MLC 2026 : 164 పరుగులకే ఆలౌట్ అయినా తగ్గేదేలే.. మొదటిసారి MLC 2026 ముద్దాడిన షారుఖ్ ఖాన్ టీం
Mlc 2026
Rakesh
|

Updated on: Jul 19, 2026 | 11:46 AM

Share

MLC 2026 : మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు చెందిన లాస్ ఎంజిల్స్ నైట్ రైడర్స్ జట్టు ఈ టోర్నమెంట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టును ఆఖరి బంతికి ఓడించి లాస్ ఎంజిల్స్ నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది. కేవలం 1 రన్ తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకోవడం ద్వారా నైట్ రైడర్స్ జట్టు మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో పాటు ఆ జట్టు పేరిట మూడు పెద్ద రికార్డులు కూడా నమోదయ్యాయి.

ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన లాస్ ఎంజిల్స్ నైట్ రైడర్స్ జట్టు 19.4 ఓవర్లలో 164 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్ వేగంగా ఆడి జట్టులో అత్యధికంగా 47 పరుగులు చేయగా, అతని భాగస్వామి కాలిన్ మన్రో 40 పరుగులతో రాణించాడు. వీరిద్దరితో పాటు మిడిలార్డర్ బ్యాటర్ మాథ్యూ ట్రాంప్ 39 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ ముగ్గురు మినహా నైట్ రైడర్స్ జట్టులోని మిగిలిన బ్యాటర్లు ఎవరూ కూడా కనీసం రెండెంకల స్కోరు దాటలేకపోయారు. దీనితో వాషింగ్టన్ ఫ్రీడమ్ ముందు 165 పరుగుల మోస్తరు లక్ష్యం నమోదైంది.

లక్ష్య ఛేదనలో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు 19 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి బలంగా కనిపించింది. ఆఖరి ఓవర్లో ఆ జట్టు గెలుపునకు 14 పరుగులు అవసరం కాగా చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. ఈ ఉత్కంఠభరిత సమయంలో నైట్ రైడర్స్ కెప్టెన్ బంతిని వ్యాన్ స్కాక్‌విక్ చేతికి ఇచ్చాడు. ఆఖరి ఓవర్ మొదటి బంతికే వాషింగ్టన్ బ్యాటర్ సిక్స్ కొట్టడంతో మ్యాచ్ వారి చేతుల్లోకి వెళ్లినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత స్కాక్‌విక్ అద్భుతమైన వైవిధ్యంతో బౌలింగ్ చేసి తర్వాతి రెండు బంతుల్లో రెండు కీలక వికెట్లు పడగొట్టి వాషింగ్టన్‌ను గట్టి దెబ్బ కొట్టాడు.

ఓవర్ నాల్గో బంతికి ఫోర్ రావడంతో మ్యాచ్ మళ్లీ ఉత్కంఠగా మారింది. ఐదో బంతికి ఒక రన్ రావడంతో, మ్యాచ్ ఆఖరి బంతికి వాషింగ్టన్ ఫ్రీడమ్ గెలవడానికి 3 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫోర్ కొడితే వాషింగ్టన్ విజయం సాధిస్తుంది, కనీసం రెండు పరుగులు తీస్తే మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీస్తుంది. కానీ స్కాక్‌విక్ వేసిన ఆఖరి బంతిని బ్యాటర్ సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. కేవలం ఒక రన్ మాత్రమే రాగా, మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లాలనే ఆరాటంలో రెండో రన్ కోసం ప్రయత్నించిన వాషింగ్టన్ బ్యాటర్ రన్ అవుట్ అయ్యాడు. దీనితో లాస్ ఎంజిల్స్ నైట్ రైడర్స్ 1 రన్ తేడాతో విజయాన్ని సంబరంచేసుకుంది.

ఈ అద్భుత విజయంతో మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలో లాస్ ఎంజిల్స్ నైట్ రైడర్స్ జట్టుకు పరుగుల పరంగా ఇదే అత్యంత చిన్న విజయంగా సరికొత్త రికార్డు నమోదైంది. దీంతో పాటు వ్యక్తిగత విభాగాల్లో మరో రెండు పెద్ద రికార్డులు బద్దలయ్యాయి. నైట్ రైడర్స్ జట్టు తరఫున అత్యధికంగా 12 క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా జేసన్ హోల్డర్ సరికొత్త రికార్డు సృష్టించి రోవ్‌మన్ పావెల్ రికార్డును అధిగమించాడు. ఇక బౌలింగ్ విభాగంలో మ్యాచ్ విన్నర్ వ్యాన్ స్కాక్‌విక్ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఆండ్రీ రస్సెల్‌ను వెనక్కి నెట్టి లాస్ ఎంజిల్స్ నైట్ రైడర్స్ జట్టు తరఫున వన్డే/టీ20 ఫార్మాట్లలో అత్యధికంగా 31 వికెట్లు తీసిన నంబర్-1 బౌలర్‌గా స్కాక్‌విక్ రికార్డు సాధించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us