Telangana: స్నేహితులు అనుకుంటే.. ఎంతకు తెగించార్రా.. ప్రియుడితో ఉండగా రహస్యంగా వీడియోలు తీసి..
Karimnagar News: ఇంటర్ చదువుతున్న బాలుడు.. పదో తరగతి చదువుతున్న బాలిక.. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.. ఇదంతా బాగానే ఉంది.. కానీ.. వారిద్దరూ రహస్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలను బాలుడి స్నేహితులు రహస్యంగా ఫోన్లో రికార్డు చేశారు.

Karimnagar News: ఇంటర్ చదువుతున్న బాలుడు.. పదో తరగతి చదువుతున్న బాలిక.. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.. ఇదంతా బాగానే ఉంది.. కానీ.. వారిద్దరూ రహస్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలను బాలుడి స్నేహితులు రహస్యంగా ఫోన్లో రికార్డు చేశారు. ఆ తర్వాత వారు దుర్మార్గంగా మారారు.. వాటిని బాలికకు చూపించి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు.. ఆ తర్వాత తల్లిదండ్రులకు చెబుతామంటూ ఆమెను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రియుడితో బాలిక సన్నిహితంగా సమయంలో రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసిన బాలుడి స్నేహితులు.. వాటిని చూపి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన కరీంనగర్ పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
కరీంనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ పట్టణానికి చెందిన ఓ బాలిక 10వ తరగతి చదువుతోంది. అదే కాలనీకి చెందిన ఓ బాలుడు ఇంటర్ చదువుతున్నాడు.. వారిద్దరూ ప్రేమించుకునేవారు. ఈ క్రమంలోనే.. కొన్ని నెలల కింద వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను బాలుడి ఇద్దరు స్నేహితులు రహస్యంగా రికార్డు చేశారు. అనంతరం బాలికను బ్లాక్‌మెయిల్ చేశారు. తల్లిదండ్రులకు చెబుతామంటూ బెదిరించి బాలికను లొంగదీసుకుని ఆమెపై అత్యాచారినికి పాల్పడ్డారు. ఇలా పలుమార్లు దారుణానికి ఒడిగట్టారు. అయితే.. ఇది తెలిసి వారిద్దరి స్నేహితులైన మరో ముగ్గురు.. కూడా బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఈ విషయం షీటీమ్ దృష్టికి వెళ్లింది. అయితే, అనంతరం పోలీసులు నిందితులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఆ తర్వాత ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. అయితే, సోమవారం బాలిక తల్లిదండ్రులతో కలిసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు బాలిక ప్రేమికుడితోపాటు ఆరుగురిపై పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదైన ఆరుగురిలో అయిదుగురు ఇంటర్ చదువుతుండగా.. మరో వ్యక్తి మేజర్ అని పాలిటెక్నిక్ చదువుతున్నాడని పోలీసులు తెలిపారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
