AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad:డ్రగ్స్‌పై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం.. రూ. 950 కోట్ల విలువైన మత్తుపదార్థాల ధ్వంసం

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భారీ స్థాయిలో డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు హైదరాబాద్‌ పోలీసులు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పట్టుబడ్డ డ్రగ్స్‌ను ధ్వసం చేశారు కస్టమ్స్ అధికారులు. ధ్వంసం చేసిన డ్రగ్స్‌ విలువ విదేశీ మార్కెట్‌లో సుమారు 950 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

Hyderabad:డ్రగ్స్‌పై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం..  రూ. 950 కోట్ల విలువైన మత్తుపదార్థాల ధ్వంసం
Drugs
Basha Shek
|

Updated on: Jun 27, 2023 | 7:28 AM

Share

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భారీ స్థాయిలో డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు హైదరాబాద్‌ పోలీసులు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పట్టుబడ్డ డ్రగ్స్‌ను ధ్వసం చేశారు కస్టమ్స్ అధికారులు. ధ్వంసం చేసిన డ్రగ్స్‌ విలువ విదేశీ మార్కెట్‌లో సుమారు 950 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 23 రకాల మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలను దుండిగల్‌లోని హైదరాబాద్ వేస్ట్ మేనేజ్‌మెంట్​ప్రాజెక్టులో అధికారులు ధ్వంసం చేశారు. 409 కిలోల ఆల్ఫాజోలం, 2655 కిలోల గంజాయి, 142 కిలోల ఎపిడ్రిన్ హైడ్రో క్లోరైడ్, 11 కిలోల హెరైన్, 74.92 కిలోల కెటమైన్, 2.95 కిలోల మెఫిడ్రోన్, 53.98 కిలోల మెటక్విలోన్, 55.95 కిలోల ఎఫిడ్రిన్ తయారీలో వాడే రసాయనాలను పూర్తిగా ధ్వంసం చేశారు హైదరాబాద్‌ పోలీసులు. కొంతకాలంగా కొకైన్ హెరాయిన్‌తోపాటు 16 రకాల డ్రగ్స్‌ను హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే పట్టుకున్నారు అధికారులు.

హైదరాబాద్‌లో పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఉక్కుపాదం మోపుతున్నా.. డ్రగ్‌ రాకెట్లు బయటపడుతూనే ఉన్నాయి. మత్తుకు బానిసగా మారిన యువతను టార్గెట్‌ చేసుకున్న మాఫియా.. చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తోంది. ఈ క్రమంలోనే.. మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దంటున్నారు పోలీసులు, నిపుణులు. దేశానికి ఆదర్శంగా నిలవాల్సిన యువత డ్రగ్స్ మాయలో పడటం దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా యువతను రక్షించడం కోసమే అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు హైదరాబాద్‌ సిటీ పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి