AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి.. పరోక్షంగా సంకేతాలిచ్చిన మంత్రి కేటీఆర్..!

తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల పర్వం కొనసాగుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే....

Telangana: హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి.. పరోక్షంగా సంకేతాలిచ్చిన మంత్రి కేటీఆర్..!
Ktr Koushik Reddy
Ganesh Mudavath
|

Updated on: Jan 31, 2023 | 7:15 PM

Share

తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల పర్వం కొనసాగుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే.. బీజేపీ వల్లే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజురాబాద్‌ నుంచి వచ్చే ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కౌశిక్‌రెడ్డిని బరిలో దింపుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని పరోక్షంగా ప్రకటించారు. వచ్చే 8 నెలలు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. బైపోల్‌లో ఈటలపై గెల్లు శ్రీనివాస్‌ యాదవ్ పోటీ చేశారు. ఆయన సమక్షంలోనే కౌశిక్‌రెడ్డి పేరును కేటీఆర్ ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈటలను కౌశిక్ రెడ్డి ఢీ కొట్టనున్నట్లు తెలుస్తోంది.

బహిరంగ సభతో బలం నిరూపించుకున్న కౌశిక్‌రెడ్డిని హుజురాబాద్ ప్రజలు కచ్చితంగా ఆశీర్వదిస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు. హుజురాబాద్‌ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. హుజురాబాద్‌ను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బైపోల్‌ తర్వాత తొలిసారిగా హుజూరాబాద్ నియోజకవర్గానికి కేటీఆర్ వచ్చారు. ఈటలను ఓడించడమే లక్ష్యంగా ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే జనాల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బండి సంజయ్‌పై పంచ్‌ల వర్షం కురిపించారు మంత్రి కేటీఆర్. మసీదులు కాదు .. అభివృద్ధి పనుల కోసం పునాదులు తవ్వుదాం అంటూ సవాల్ విసిరారు.

సరిగ్గా 14 నెలల కిందట ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించారు. నిధుల వరద పారిస్తాం, హుజూరాబాద్‌ను మార్చేస్తాం అన్నారు. హుజూరాబాద్‌లో ఇదివరకు జరగని అద్భుతాలు చేస్తామని చాలామాటలు చెప్పారు. రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని, తండ్రిలాంటి వ్యక్తిని పట్టుకొని అరిష్టమని మాట్లాడుతున్నారు. ఇది మీకు తగునా. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో పేదలను కొట్టి.. పేదలకు పెట్టే ప్రభుత్వం. కాకులను కొట్టి గద్దలకు పెట్టే ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

              – కేటీఆర్, తెలంగాణ మంత్రి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..