KTR: ఆ పరీక్ష నోటిఫికేషన్‌ను సవరించండి.. అమిత్‌షాకు కేటీఆర్ విజ్ఞప్తి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏంగా 9212 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పరీక్షలను కేవలం హిందీ, ఇంగ్లిష్‌లోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే...
కేంద్ర ప్రభుత్వం ఇటీవల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏంగా 9212 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పరీక్షలను కేవలం హిందీ, ఇంగ్లిష్‌లోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే సీఆర్‌పీఎఫ్ పరీక్షను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇతర అధికారిక భాషల్లో నిర్వహించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర హోం మంత్రిని అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
కేంద్ర CRPF ప్రభుత్వ ఉద్యోగాల కోసం కేవలం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే పోటీ పరీక్షల నిర్వహిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తాజాగా విడుదల చేసిన సిఆర్పిఎఫ్ CRPF జాతీయ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో కేవలం హిందీ మరియు ఇంగ్లీష్ మాధ్యమాల్లో మాత్రమే పరీక్ష ఉంటుందని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. సిఆర్పిఎఫ్ ఉద్యోగ సిబ్బంది నియామకం కోసం చేపడుతున్న ఈ పరీక్షను, తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంతో పాటు గుర్తించబడిన అన్ని అధికారిక భాషల్లో నిర్వహించాలని కేంద్రాన్ని కెటీఅర్ డిమాండ్ చేశారు.
కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే ఈ పోటీ పరీక్షలను నిర్వహించడం వల్ల తీవ్ర వివక్షత ఎర్పడుతుందని, ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో చదవని వారు లేదా హిందీ ప్రాంతాలకు చెందని నిరుద్యోగ యువకులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికే వివిధ ఉద్యోగాల కోసం అనేక పరీక్షలు నిర్వహించే బదులు, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా కామన్ ఎలిజిబిటీ టెస్ట్ విధానంలో 12 అధికారిక భాషల్లో పరీక్ష నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ఈ నిర్ణయం సంపూర్ణంగా అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్, తాజాగా సిఆర్పిఎఫ్ సిబ్బంది నియామకం కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ లో హిందీ మరియు ఇంగ్లీష్ మాద్యమాల్లోనే పరీక్ష అంటుూ విధించిన పరిమితులను కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తన లేఖలో కేటీఆర్ తీసుకువచ్చారు.
అనేక అధికారిక భాషలు కలిగిన భారత దేశంలో, కేవలం హిందీ వారికి మాత్రమే మాతృభాషలో పోటీ పరీక్షలు రాసే అవకాశం ఇవ్వడమంటే దేశ రాజ్యాంగ స్పూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు. దేశంలో రాజ భాష అంటూ ఏదీ లేదని రాజ్యాంగం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషలను పట్టించుకోకుండా కేవలం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సమాన అవకాశాలు పొందేలా ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని CRPF నోటిఫికేషన్ కాలరాస్తుందని తెలిపారు.
Request HM @AmitShah Ji to revise the CRPF national recruitment notification to include Telugu, Tamil, Kannada, Malayalam & other official languages
These competitive exams are being held only in English and Hindi, which is a serious disadvantage to students who did not study in… pic.twitter.com/RnmvJ87r0m
— KTR (@KTRBRS) April 7, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..