PM Modi: శనివారం హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. రూ.11,300 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..

శనివారం హైదరాబాద్ వస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అప్పుడే హీట్‌ మొదలైపోయింది. బీజేపీ VS బీఆర్ఎస్ అన్నట్లుగా మారిపోయింది సీన్.! మాటల తూటాలు .. సవాళ్లు.. పోస్టర్లు.. ఇలా సాగుతోంది వార్..! అటు ప్రధాని కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటున్నారు..

PM Modi: శనివారం హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. రూ.11,300 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..
PM Modi
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 07, 2023 | 8:24 PM

11 వేల 300 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు శనివారం హైదరాబాద్ వస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉదయం 11.30కు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్తారు. రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోదీ. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్‌తోపాటు.. హైదరాబాద్-మహబూబ్ నగర్ రైవే డబ్లింగ్ పనులను ప్రారంభిస్తారు. MMTS సెకండ్ ఫేజ్ లో భాగంగా 13 ట్రైన్లకు పచ్చజెండా ఊపుతారు. ఆ తరువాత పరేడ్ గ్రౌండ్స్ వెళ్తారు. అక్కడి నుంచే 5 జాతీయ రహదారుల పనుల ప్రారంభంతో పాటు బీబీ నగర్ ఎయిమ్స్‌కు సంబంధించి కొత్త బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో మాట్లాడుతారు ప్రధాని మోదీ.

శనివారం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే అధికారికంగా ఆహ్వానం పంపారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే సభలో కేసీఆర్ స్పీచ్‌ కోసం 7 నిమిషాల టైమ్‌ కూడా కేటాయించారు. అయితే ఈసారి కూడా కేసీఆర్ దూరంగానే ఉండాలని నిర్ణయించుకోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని మోదీకి స్వాగతం పలుకుతారు. అయితే కేసీఆర్ గైర్హాజరుపై తమ వెర్షన్‌ను గట్టిగానే వినిపిస్తోంది బీఆర్ఎస్.

శనివారం మోదీ సభకు సీఎం కేసీఆర్ వస్తే గజమాలతో సత్కరించి సన్మానం చేస్తామన్నారు బండి సంజయ్. ప్రధాని పర్యటన రోజే బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.

హైదరాబాద్‌లో వెలిసిన ఫ్లెక్సీలు హీట్‌ను రాజేస్తున్నాయి. పరివార్ వెల్కమ్స్ యూ మోదీజీ అంటూ బీజేపీలోని వారసత్వ నాయకులతో పాటు అదాని, అంబానీల ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే