AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మీ వైఖరి మార్చుకోండి.. బండి సంజయ్‌కు పోలీస్‌ అధికారుల సంఘం సూచన

బండి సంజయ్ తన వైఖరి మార్చుకోవాలని సూచించింది. సీపీ రంగనాథ్ పై చేసిన వాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు పోలీస్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపీరెడ్డి. 

Telangana: మీ వైఖరి మార్చుకోండి.. బండి సంజయ్‌కు పోలీస్‌ అధికారుల సంఘం సూచన
MP Bandi Sanjay Kumar
Sanjay Kasula
|

Updated on: Apr 07, 2023 | 8:09 PM

Share

వరంగల్ సీపీ రంగనాథ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను పోలీస్‌ అధికారుల సంఘం తప్పుబట్టింది. బండి సంజయ్ తన వైఖరి మార్చుకోవాలని సూచించింది. సీపీ రంగనాథ్ పై చేసిన వాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు పోలీస్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపీరెడ్డి. వరంగల్ సీపీ రంగనాథ్ పై బండి సంజయ్ వ్యక్తిగత దూషణ చేయడం సరికాదన్నారు. ఏ కేసుల్లోనూ తమకు ప్రత్యేకంగా ప్రమాణం చేయాల్సిన అవసరం లేదన్నారు. విధుల్లో చేరినప్పుడే నిజాయితీ, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తామన్నారు. ఏదైనా సమస్య ఉంటే న్యాయస్థానాల్లో తేల్చుకోవాలన్నారు.

ఇదిలావుంటే, రెండు రోజుల క్రితం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలను కూడా వై గోపీరెడ్డి తప్పుపట్టారు. గౌరవ ప్రదమైన చట్టసభలో సభ్యుడిగా ఉండి.. అభ్యంతరమైన భాష వాడడం హేయమన్నారు. అరెస్టు నిబంధనలు పాటించకుండా ప్రశ్నించవచ్చని, కోర్టును ఆశ్రయించవచ్చన్నారు.

కానీ, ఆటవిక భాషను ఉపయోగించి అత్యున్నత పదవిలో ఉన్న డీజీపీని అవమానకర, అభ్యంతరకర రీతిలో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీస్‌శాఖ అధిపతిని అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ సిబ్బంది మనోధైర్యాన్ని, మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలు మానుకోవాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ