AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొలింగ్, కౌంటింగ్ తేదీలు కూడా కలిసివచ్చేలా ఉన్నాయ్: కేటీఆర్

కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం పక్కా అంటున్నారు మంత్రి కేటీఆర్. ఎలక్షన్ తేదీ, కౌంటింగ్ తేదీలు కూడా కలిసివచ్చేలా ఉన్నాయన్నారు. బీఆర్‌ఎస్ ట్రాక్ రికార్డ్, కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ మీ ముందుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. కేసీఆర్ జబర్దస్త్‌గా ఉన్నారన్న మంత్రి కేటీఆర్‌.. ఇవ్వాల్సిన హామీలపై కసరత్తు చేస్తున్నారన్నారు.

పొలింగ్, కౌంటింగ్ తేదీలు కూడా కలిసివచ్చేలా ఉన్నాయ్: కేటీఆర్
Minister KT Rama Rao
G Peddeesh Kumar
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 09, 2023 | 6:49 PM

Share

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పోలింగ్, ఫలితాల తేదీల ప్రకారం కేసీఆర్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని ఆ పార్టీ దృఢంగా నమ్ముతుంది.. ఏకంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే లెక్క కుదిరిందని స్వయంగా ప్రకటించారు. కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం పోలింగ్ తేదీ 30, కౌంటింగ్ డేట్ 03 కలిపితే 06 నెంబర్ రావడం శుభసూచకం అన్నారు.. లెక్క కుదిరింది.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది.. కేసిఆర్ మూడో సారి సీఎం అవడం ఖాయమని ధీమాను ప్రదర్శించారు. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని…కేసిఆర్ ఢిల్లీ పీఠాన్ని శాసించే ఎన్నికలని ఆయన తెలిపారు. కేసీఆర్ హ్యాట్రిక్ విక్టరీ సాధిస్తే పక్క రాష్ట్రాల్లో పట్టు సాధించడంతోపాటు ఢిల్లీ పీఠాన్ని కూడా శాసించవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.

వరంగల్ ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూర్ లో మూడు బహిరంగ సభలో పాల్గొన్నారు.. పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచేలా ప్రసంగించిన ఆయన బీఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్ విక్టరీ సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా బీఆర్ఎస్ పార్టీ పక్కనున్న మహారాష్ట్ర, ఇతర పొరుగు రాష్ట్రాలలో కూడా పట్టు సాధిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మనకు శ్రీరామరక్ష అన్నారు.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వచ్చినట్లే వస్తుంటారని ఎద్దేవా చేశారు. అమెరికా డాలర్లతో కొంతమంది దిగుతున్నారని.. వారి వద్ద డాలర్లు తీసుకోండి.. వారిచ్చే డబ్బులు తీసుకొండి.. ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేటీఆర్.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత.. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం పక్కా అంటున్నారు మంత్రి కేటీఆర్. ఎలక్షన్ తేదీ, కౌంటింగ్ తేదీలు కూడా కలిసివచ్చేలా ఉన్నాయన్నారు. కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం సిక్స్ వర్క్ అవుట్ అవుతుందని ఇక మూడోసారి విక్టరీ ఖాయమని ధీమాను ప్రదర్శించారు.  నవంబర్ 30వ తేదీన పోలింగ్..  డిసెంబర్ 03 తేదీన కౌంటింగ్… టోటల్ 3+3 = 6 కేసిఆర్ లక్కీ నెంబర్ రావడం వల్ల కేసీఆర్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని అన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవడాన్ని ఎవరు అడ్డుకోలేరని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ట్రాక్ రికార్డ్, కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ మీ ముందుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. కేసీఆర్ జబర్దస్త్‌గా ఉన్నారన్న మంత్రి కేటీఆర్‌.. ఇవ్వాల్సిన హామీలపై కసరత్తు చేస్తున్నారన్నారు.. రేపోమాపో బయటకివచ్చి అన్నీచెబుతారన్నారు.‌

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..