AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: తెలంగాణ దంగల్‌.. 52 డేస్‌ టు గో..! పైచేయి సాధించేదెవరు..?

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అధికారికంగా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నిన్నటి వరకు ఓ లెక్క.. ఇక మీదట మరోలెక్క అంటూ పార్టీలు సవాళ్లు విసురుకుంటున్నాయి. సౌతిండియా రికార్డులు తిరగరాస్తామని బీఆర్ఎస్‌ అంటోంది. డిసెంబర్‌ అద్భుతం చూపిస్తామంటోంది కాంగ్రెస్‌ పార్టీ. మార్పు కోరుకుంటున్న ప్రజలు తమను గెలిపించి నిశ్శబ్ధ విప్లవం సృష్టిస్తారంటోంది బీజేపీ.

Big News Big Debate: తెలంగాణ దంగల్‌.. 52 డేస్‌ టు గో..! పైచేయి సాధించేదెవరు..?
Telangana Politics
Shaik Madar Saheb
|

Updated on: Oct 09, 2023 | 7:00 PM

Share

Big News Big Debate: ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది తెలంగాణ.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రావటంతో అధికారికంగానే యుద్ధం మొదలైంది. వ్యూహాలకు ప్రతివ్యూహాలు.. కౌంటర్లకు రీకౌంటర్లు. విమర్శలకు ప్రతివిమర్శలతో మార్మోగుతున్నాయి పల్లెలు, పట్నాలు. బీఆర్‌ఎస్‌ నుంచి సౌండ్ వస్తే.. ప్రత్యర్ధుల నుంచి రీసౌండ్స్‌ వస్తున్నాయి.. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన బీఆర్ఎస్‌ హ్యాట్రిక్‌పై గురిపెట్టింది. 2018లో 88 సీట్లు గెలిచిన కారు.. ఈ సారి సెంచురీ లక్ష్యంగా పెట్టుకుంది. మూడోసారి సీఎం బాధ్యతలు చేపట్టి కేసీఆర్ సౌతిండియాలోనే అరుదైన రికార్డు నమోదు చేయబోతున్నారన్నారని కేటీఆర్‌ ధీమాగా చెబుతున్నారు. తమ సీఎం అభ్యర్ధి కేసీఆర్‌.. మరి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎవరంటూ సవాల్‌ కూడా విసురుతున్నారు మంత్రులు..

40 ఏళ్ల రాజకీయ జీవితం అనుభవించిన కేసీఆర్‌కు ఇక విశ్రాంతి ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటోంది కాంగ్రెస్. డిసెంబర్‌ అంటేనే తెలంగాణలో అధ్బుతాలు ఉంటాయని.. ఈ సారి కూడా కాంగ్రెస్‌ విజయంతో మహాద్భుతం జరగబోతుందంటూ ధీమాగా చెబుతున్నారు పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి..

అధికారపార్టీ స్పీడు… కాంగ్రెస్‌ పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంటే.. తమదంతా సైలెంట్‌ వేవ్‌ అంటున్నారు బీజేపీ నేతలు. నెంబర్‌ వన్‌ ప్లేస్‌ తమదేనంటోంది కాషాయం..

నగారా మోగటంతో ప్రత్యర్థులను టార్గెట్‌ చేస్తూనే… వ్యూహాలపై దృష్టిసారించాయి. అభ్యర్ధుల ఎంపికలో అధికారపార్టీ ముందుంటే.. మిగిలిన పార్టీలు ఇంకా కసరత్తు చేస్తున్నాయి. ఇక పొత్తులపైనా అస్పష్టత కనిపిస్తోంది. పొత్తు పొడుపులు ఉంటాయా..? ఎవరికి వారు సింగిల్‌గానే వార్ లో ఎంట్రీ ఇస్తారా? మొత్తానికి షెడ్యూల్‌ తో తెలంగాణ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి.

బిగ్ న్యూస్ బిగ్ డిడేట్ లైవ్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..