Minister KTR: తెలంగాణలో కొలువుదీరిన మరో భారీ పరిశ్రమ.. అమరరాజా గిగా ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ భూమి పూజ
అమరాజా గిగా కారిడార్ శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఎనిమిది రాష్ట్రాలు పోటీపడ్డప్పటికీ మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో అమరాజా కంపెనీ నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమరాజా కంపెనీ ఏర్పాటు వల్ల పది వేల ఉద్యోగాలు వస్తాయని , చుట్టుపక్కల ప్రాంత రూపు రేఖలు మారి పోతాయిన్నారు కేటీఆర్.
అమరాజా గిగా కారిడార్ శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఎనిమిది రాష్ట్రాలు పోటీపడ్డప్పటికీ మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో అమరాజా కంపెనీ నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమరాజా కంపెనీ ఏర్పాటు వల్ల పది వేల ఉద్యోగాలు వస్తాయని , చుట్టుపక్కల ప్రాంత రూపు రేఖలు మారి పోతాయిన్నారు కేటీఆర్. కొంత మంది అభివృద్ధి నిరోధకులు లేని పోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారని , స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక్కడ స్థాపిస్తున్న లీథియం అయాన్ ఫ్యాక్టరీ మాత్రమే. పాత బ్యాటరీల తయారీ కాదని స్పష్టం చేశారు కేటీఆర్. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీ ఇక్కడ తయారవుతుందని , ఎలాంటి కాలుష్యం ఉండదని తెలిపారు. వచ్చే పదేళ్లలో 9500 కోట్ల పెట్టుబడులు అమరరాజా యాజమాన్యం పెట్టబోతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థ మొత్తం 270 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. భూమి పూజ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, గల్లా జయదేవ్ తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణ తదితరులు హాజరయ్యారు.
భూమి పూజ అనంతరం అమరరాజా గిగా ఫ్యాక్టరీపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈవీ, సస్టెయినబుల్ మొబిలిటీ రంగంలో తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఇదొక పెద్ద అడుగు అని కేటీఆర్ ప్రశంసించారు. రూ. 9,500 కోట్లతో ఈ గిగా ప్లాంట్ ను నిర్మిస్తున్నారని వెల్లడించారు. మహబూబ్ నగర్ కు సంబంధించి అతిపెద్ద ఇన్వెస్ట్ మెంట్ అన్నారు. గిగా ఫ్యాక్టరీ కోసం తెలంగాణను ఎంపిక చేసుకున్నందుకు తన మిత్రుడు గల్లా జయదేవ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Laid foundation for @AmaraRaja_Group Lithium Ion Battery manufacturing Giga plant amounting ₹9,500 Crore investment at Mahabubnagar IT Tower along with Hon’ble Minister Sri @KTRBRS Garu, @JayGalla & Other Dignitaries. #ManaMahabubnagar #MahabubnagarITTower pic.twitter.com/aK325BTqX3
— V Srinivas Goud (@VSrinivasGoud) May 6, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..