Hyderabad Flyover: భాగ్యనగర సిగలో మరో సేతు హారం.. ఫ్లై ఓవర్ డ్రోన్ విజువల్స్‌ను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్. 

గచ్చీబౌలీ ఫ్లై ఓవర్ పై నుంచి రూపొందించిన కొత్త ఫ్లై ఓవర్‌ను శుక్రవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్‌కు సంబంధించిన విజువల్స్‌ను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు ద్వారా వయా గచ్చిబౌలి వరకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జీలను నిర్మాణించారు.

Hyderabad Flyover: భాగ్యనగర సిగలో మరో సేతు హారం.. ఫ్లై ఓవర్ డ్రోన్ విజువల్స్‌ను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్. 
Shilpa Layout Flyover
Follow us

|

Updated on: Nov 25, 2022 | 4:49 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. శిల్పా లేఔట్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు పురపాలక మంత్రి కేటీఆర్. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు ద్వారా వయా గచ్చిబౌలి వరకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జీలను నిర్మాణించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సైబరాబాద్‌ ఏరియాలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పడనుంది. గచ్చిబౌలి జంక్షన్‌లో 300 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దీని సాయంతో ఔటర్ రింగ్‌ రోడ్‌ నుంచి సిటీలోకి ఎంట్రీ అవడం సులభం అవుతుంది. జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి మీదుగా పటాన్‌చెరు, కోకాపేట్, నార్సింగ్‌తో పాటు, శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టుకు ఈజీగా వెళ్లే వీలు కలుగుతుంది.

జంటనగరాల్లో ట్రాఫిక్ కష్టాలు కొద్దికొద్దిగానైనా తీరబోతున్నాయ్. సిగ్నల్ రహిత, మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడంలో ఎప్పటికప్పుడు ముందడుగులు పడుతూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా భాగ్యనగరంలో మరో ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది GHMC. స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ SRDP కింద చేపట్టిన నాగోల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇవాళ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా… ప్రజలకు అంకితం కాబోతోంది నాగోల్ ఫ్లైఓవర్.

శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ విజులవ్స్ ఇక్కడ చూడండి..

యుటిలిటీ షిఫ్టింగ్‌, భూసేకరణ, ప్రాజెక్ట్‌తో కలిపి ఈ ఫ్లైఓవర్‌కి మొత్తం 143కోట్ల 58లక్షల ఖర్చయింది. 990 మీటర్ల పొడవున్న ఈ ఫ్లైఓవర్‌ను 6 లేన్స్‌ అండ్ బై డైరెక్షన్‌తో నిర్మించారు. నాగోల్ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడం వల్ల ఉప్పల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు ఎలాంటి సిగ్నల్‌ లేకుండా రయ్‌రయ్‌మంటూ వాహనాలు దూసుపోవచ్చు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ మీదుగా ఉప్పల్‌ వెళ్లేందుక్కూడా ఇది ఉపయోగపడుతుంది.

హైదరాబాద్‌లో మెరుగైన రవాణాయే లక్ష్యంగా ఫ్లైఓవర్లు నిర్మిస్తున్న GHMC…. SRDP కింద మొత్తం 47 పనులు చేపట్టింది. ఇప్పటివరకు 31 ప్రాజెక్టులు కంప్లీట్‌ అయ్యాయి. మరో 16 పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. కంప్లీటైన 31 పనుల్లో ఆల్రెడీ 15 ఫ్లైఓవర్లు అందుబాటులోకొచ్చాయి. ఈ వరుసలో నాగోల్ ఫ్లైఓవర్‌ 16వది. సిటీలోకి ఎంటరవ్వాలంటే ఎక్కువమందికి ఇదే కీలక మార్గం.

ఫ్లైఓవర్ల పరంపర ఇక్కడితోనే ఆగిపోలేదు. మాదాపూర్‌, గచ్చిబౌలిలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు త్వరలో మరో రెండు ఫ్లైఓవర్లు రాబోతున్నాయి. ఒకటి కొత్తగూడ ఫ్లైఓవర్‌, మరొకటి శిల్పా లేఅవుట్‌ బ్రిడ్జ్‌. ఈ రెండింటి పనులు పూర్తికావొస్తున్నాయి. వీటిని కూడా డిసెంబర్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. ఇవాళయితే… నాగోల్ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రాబోతోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం