Minister Harish Rao: తెలంగాణ కొత్త హెల్త్‌ మినిష్టర్‌పై క్లారిటీ.. ట్రబుల్‌ షూటర్‌కే ఆరోగ్య శాఖ.. బలం చేకూరుస్తున్న వరుస భేటీలు..!

తెలంగాణలో కొత్త హెల్త్‌ మినిష్టర్‌ ఎవరనే దానిపై క్లారిటీ వస్తోంది. ఎన్నో ప్రచారాలు, మరెన్నో ఊహాగానాలు వచ్చినా జరగాల్సింది జరిగిపోతోంది. వరుస భేటీలు, సమీక్షలు చూస్తుంటే ఆయనే అని స్పష్టమైపోతోంది.

Minister Harish Rao: తెలంగాణ కొత్త హెల్త్‌ మినిష్టర్‌పై క్లారిటీ.. ట్రబుల్‌ షూటర్‌కే ఆరోగ్య శాఖ.. బలం చేకూరుస్తున్న వరుస భేటీలు..!
Minister Harish Rao Will Take Telangana New Health Minister

Minister Harish Rao: తెలంగాణలో కొత్త హెల్త్‌ మినిష్టర్‌ ఎవరనే దానిపై క్లారిటీ వస్తోంది. ఎన్నో ప్రచారాలు, మరెన్నో ఊహాగానాలు వచ్చినా జరగాల్సింది జరిగిపోతోంది. వరుస భేటీలు, సమీక్షలు చూస్తుంటే ఆయనే అని స్పష్టమైపోతోంది. సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మకంగా ఆయనకే పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఎలాంటి క్లిష్ల పరిస్థితులైన అవలీలగా ఛేదించి గల నేతగా పేరు తెచ్చుకున్న ట్రబుల్‌ షూటర్‌ టీ.హరీష్ రావు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్నిరోజులుగా ఐదువేల, అంతకన్నా తక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ నిర్వహించిన సమీక్షలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. కేసీఆర్ ఆదేశాలతో హరీశ్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేసిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్‌ ఆ బాధ్యతలు చూస్తున్నారు.  దీన్ని బట్టి చూస్తుంటే, త్వరలో ఆరోగ్య శాఖను మంత్రి హరీశ్​రావుకు అప్పగించే అవకాశాలున్నట్లు టీఆర్​ఎస్​ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖను మరొకరికి కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కొత్త వారికి అప్పగిస్తారన్న చర్చలు సైతం సాగాయి. ఈటల రాజేందర్​ను కేబినెట్​నుంచి బర్తరఫ్​ చేసినప్పటి నుంచీ సీఎం కేసీఆరే ఆ శాఖను చూస్తున్నారు. కొంతకాలంగా సొంత నియోజకవర్గానికి పరిమితమైన హరీశ్​.. ఇప్పుడు ఆరోగ్య శాఖ పనుల్లో బిజీగా ఉంటున్నారు. వరుసగా సీఎం నిర్వహిస్తున్న హెల్త్ రివ్యూ మీటింగ్​లన్నింటిలో ఆయన పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ట్రబుల్‌ షూటర్‌నే రంగంలోకి దింపుతున్నట్లు తాజా మీటింగ్‌లను బట్టి స్పష్టమవుతోంది. మంత్రి హరీష్‌రావు వరుస సమీక్షలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

కొంతకాలంగా సొంత నియోజకవర్గానికి పరిమితమయ్యారు హరీష్‌రావు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కరోనా కట్టడి సమీక్షల్లో బిజీగా అయ్యారు. సీఎం కేసీఆర్‌ నిర్వహిస్తున్న రివ్యూ మీటింగ్‌లకు హాజరవుతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ బుధవారం పలు రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనికి సైతం హరీష్‌రావే హాజరుకావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. స‌మావేశాల్లో తీసుకునే నిర్ణయాలు, వాటి అమలుతోపాటు చేపట్టాల్సిన చర్యల పర్యవేక్షణను హరీశ్​రావుకే సీఎం అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


మొదటి నుంచి హరీష్‌రావుకు ట్రబుల్‌ షూటర్‌గా మంచి పేరుంది. ఆయన పూర్తి స్థాయిలో పని చేయడమే కాకుండా అధికారులను పరుగులు పెట్టించి సమస్యలను పరిష్కరిస్తారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆయనకే బాధ్యతలు అప్పగిస్తే మంచి రిజల్ట్‌ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ సైతం హరీష్‌కు అప్పగిస్తే పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తారనే భావనలో ఉన్నట్లు సమాచారం.

ఇరిగేష‌న్ శాఖ‌ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్‌ పనితనం ఏంటో అందరూ చూశారు. ముఖ్యమంత్రి అనుకున్న రీతిలో పని చేశారు. ఇప్పుడు అదే రీతిన వైద్య ఆరోగ్య శాఖను ఆయనకే అప్పగిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న హరీశ్​రావుకు త్వరలో హెల్త్​ పోర్టుఫోలియో కూడా అప్పగించే అవకాశం ఉందని టీఆర్​ఎస్​ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా మంత్రి కేటీఆర్​కు కూడా సీఎం మరో బాధ్యత అప్పగించారు. వ్యాక్సిన్, మెడిసిన్​ కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన టాస్క్​ఫోర్స్​ కమిటీకి కేటీఆర్​ను చైర్మన్​గా నియమించారు. కాగా, సీఎం ఆదేశాలతో ఆయన ఈ మీటింగ్​కు అటెండ్​ అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రెస్​నోట్​ పేర్కొంది.

Read Also… PM Modi: కరోనా నియంత్రణపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు మోదీ ఫ్లాన్.. ఈ నెల 18, 20న జిల్లా కలెక్టర్లతో సమావేశం..!