Minister Harish Rao: బీజేపీ ఎందులో సక్సెస్ అంటే.. అంటూ అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు సెటైర్లు..

రొటేషన్ లో వచ్చే G-20 ప్రెసిడెంట్ షిప్ ను తమ ఘనతగా చెప్పుకోవడంలో.. మతపిచ్చి మంటలు రేపడంలో డబుల్ సక్సెస్ అంటూ సెటైర్లతో విరుచుకుపడ్డారు మంత్రి హరీష్ రావు.

Minister Harish Rao: బీజేపీ ఎందులో సక్సెస్ అంటే.. అంటూ అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు సెటైర్లు..
Minister Harish Rao
Follow us

|

Updated on: Feb 08, 2023 | 6:08 PM

బీజేపీకి తెలిసింది అదొక్కటే అంటూ అసెంబ్లీలో విరుచుకుపడ్డారు మంత్రి హరీశ్ రావు. బిజెపి ఎందులో సక్సెస్ అంటే..జీడీపీని మంటగలపడంలో.. ఫుడ్ సెక్యూరిటీని నాశనం చేయడంలో.. 160 లక్షల కోట్ల అప్పులు చేయడంలో.. సెస్సుల రూపంలో అడ్డగోలుగా పన్నులు వేయడంలో.. ఆకాశాన్ని తాకేట్టు సిలిండర్ ధర పెంచడంలో.. పసిపిల్లలు తాగే పాల మీద కూడా జీఎస్టీ విధించడంలో.. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడంలో.. ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడంలో.. రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయడంలో.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంలో.. ఆదానీ ఆస్తులు పెంచడంలో.. రొటేషన్ లో వచ్చే G-20 ప్రెసిడెంట్ షిప్ ను తమ ఘనతగా చెప్పుకోవడంలో.. మతపిచ్చి మంటలు రేపడంలో డబుల్ సక్సెస్ అంటూ సెటైర్లతో విరుచుకుపడ్డారు మంత్రి హరీష్ రావు.

మిషన్‌ భగీరథ పథకం రూపంలో దేశం ముందు ఒక నమూనాగా తెలంగాణ నిలిపిందని అన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణను చూసి కేంద్రం ప్రారంభించిన హర్‌ ఘర్‌ జల్‌ పథకం సవ్యంగా సాగటం లేదంటూ విమర్శించారు. మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు.

అమృత్‌కాల్‌ అని చెప్తున్న బీజేపీ పాలన దేశ ప్రజలకు ఆపద కాలం తెచ్చిపెట్టిందని విమర్శించారు. గోదావరి జలాలను 600 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లిన ఘనత ఈ సర్కారుది అని వెల్లడించారు. ప్రపంచమే ఆశ్చర్యపడే కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే నిర్మించామన్నారు. చనిపోయిన వ్యక్తుల పేరు మీద కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ప్రజలకు కావల్సినంత పవర్ ఇచ్చినందుకే ప్రజలు తమకు పవర్‌ ఇచ్చారన్నారు. ప్రజలకు మేం నిరంతరం పవర్‌ ఇస్తాం, ప్రజలు కూడా ఎప్పటికీ తమకే పవర్‌ ఇస్తారని వెల్లడించారు. పవర్‌ హాలీడే ఇచ్చారు కాబట్టే కాంగ్రెస్‌ పవర్‌కు ప్రజలు హాలిడే ఇచ్చారని ఎద్దేవ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సరిపడా నీళ్లు, నిధులు ఇస్తోందని అన్నదాత సంబరపడుతున్నాడని వెల్లడించారు. ఇదంతా చూసి ఎప్పటికీ పవర్‌ రాదేమోనని విపక్షాలకు బాధ కల్గుతోందని ఎద్దేవ చేశారు మంత్రి హరీష్ రావు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం