AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అందువల్లే రేషన్ పంపిణీలో జాప్యం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి గంగుల కమలాకర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో నేటినుంచి పేదలకు ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

Telangana: అందువల్లే రేషన్ పంపిణీలో జాప్యం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి గంగుల కమలాకర్
Ration in Telangana
Shaik Madar Saheb
|

Updated on: Jan 11, 2023 | 6:18 PM

Share

Gangula Kamalakar: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో నేటినుంచి పేదలకు ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పేదల కోసం నిరంతరం తపించే వ్యక్తి అని.. ఆయన అందరి అభ్యున్నతి గురించి ఆలోచిస్తారని గంగుల తెలిపారు. ఈ మేరకు గంగుల కమలాకర్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. సాప్ట్వేర్ మాడిఫికేషన్ వల్లే బియ్యం పంపిణీలో కొంత జాప్యం జరిగిందన్నారు. డిసెంబర్ వరకూ కేంద్రం ఇచ్చిన ఐదు కిలోలకు అదనంగా రాష్ట్రం సొంతంగా భారం భరించి అన్ని కార్డుదారులకు పది కిలోలు ఉచితంగా ఇచ్చిందన్నారు. ఈ జనవరి నుంచి కేంద్రం నిర్ణయం ప్రకారం ఇవ్వడానికి సాప్ట్వేర్ మాడిఫికేషన్ చేయాల్సి వచ్చిందని తెలియజేసారు. గతంలో పిఎంజీకేఏవై కింద కేంద్రం ఆలస్యంగా నిర్ణయం వెలువరించడం వల్ల 2021 మే నుంచి 2022 డిసెంబర్ వరకూ 20 నెలలకు ఒక్కో యూనిట్ కు 200 కేజీలకు బదులు 203 కేజీలు అదనంగా ఇచ్చామన్నారు. తద్వారా 2021 మే, 2022 మే, జూన్ మాసాలలో రాష్ట్రం అదనంగా పంపిణీ చేసిన ఒక్కో కిలోని ఈ జనవరి నుండి మార్చి వరకూ సర్ధుబాటు చేయడంతో 2023 మార్చి వరకూ ఒక్కో యూనిట్కి ఐదు కిలోలు ఆ తర్వాత 2023 ఎప్రిల్ నుంచి యధావిదిగా 6కిలోలు ఉచితంగా పంపిణీ చేస్తామని మంత్రి గంగుల తెలిపారు. రాష్ట్రం స్థిరంగా అందజేసే యూనిట్ 6కిలోలను కుటుంబసభ్యుల పరిమితి లేకుండా కోటా ప్రకారమే పంపిణీ చేస్తున్నామని, ప్రజలను ఎలాంటి తికమకకు గురిచేయవద్దని మంత్రి గంగుల కమలాకర్ ఈ సందర్భంగా సూచించారు.

ఓవైపు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వంటి పేదలు నిత్యం వాడుకునే వాటి ధరల్ని పెంచుతూ.. వారి నడ్డీ విరిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ఉచిత బియ్యంపై మాట్లాడటం హాస్యాస్పదమంటూ గంగుల విమర్శించారు. కరోనా సంక్షోభంలో పేదలకు ఉచిత బియ్యంతో పాటు రెండునెల్ల పాటు 1500 రూపాయలు, వలసకార్మికులకు సైతం 5వందల రూపాయలు అందించామన్నారు.

బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కేవలం 54 లక్షల 48 వేల కార్డులకు మాత్రమే రేషన్ 5కిలోల చొప్పున అందిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వందల కోట్ల భారం భరిస్తూ మరో 92 లక్షల మందికి  సొంతంగా 6కిలోలు బియ్యం పంపిణీ చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..