AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Letter: తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సర్పంచ్‌లకు లేఖ రాసిన మంత్రి ఈటల రాజేందర్.. ఆ లేఖలో ఏముందంటే..

Minister Letter: మరికొద్ది రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి..

Minister Letter: తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సర్పంచ్‌లకు లేఖ రాసిన మంత్రి ఈటల రాజేందర్.. ఆ లేఖలో ఏముందంటే..
Shiva Prajapati
|

Updated on: Jan 12, 2021 | 9:37 PM

Share

Minister Letter: మరికొద్ది రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.. రాష్ట్రంలోని సర్పంచ్‌లందరికీ లేఖలు రాశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రధాన పాత్ర పోషించాలని కోరారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా జరిగేలా కృషి చేయాలని కోరారు. ఆ మేరకు మంగళవారం నాడు మంత్రి ఈటల రాజేందర్ లేఖలు పంపించారు. మంత్రి లేఖ యధావిధంగా..

”గౌరవనీయులైన సర్పంచ్ గారికి, ప్రపంచ మానవాళిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా వ్యాప్తి చెందకుండా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొన్న విషయం మీకు విదితమే. మొదటి నుంచి పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండి, అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తూ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడగలిగింది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానంలో కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలిగాము. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి సూచనలు, సలహాలతో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు తమ ప్రాణాలకు తెగించి సైనికుల్లా పోరాడి కరోనాపై యుద్ధం చేశారు. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలందరూ ఇళ్ళకి పరిమితం కాగా వైద్య, పోలీస్, మున్సిపల్, పంచాయతీ రాజ్ తదితర శాఖల సిబ్బంది 24 గంటలు ప్రజలకు సేవలు అందించారు. ఆ సమయంలో ప్రజాప్రతినిధులుగా మీరు అందించిన సహాయ సహకారాలు వెలకట్టలేనివి. ఎంతో మంది ఆకలితీర్చారు.”

”కష్ట కాలంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి చేదోడువాదోడుగా ఉన్నందుకు మీ అందరికీ తెలంగాణ ప్రభుత్వం తరపున హృదయ పూర్వక ధన్యవాదములు. కరోనా నివారణకు ఈనెల 16 నుండి వాక్సిన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబోతున్నాము. ముందుగా వైద్య ఆరోగ్య సిబ్బందికి, తరువాత ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి, ఆ తరువాత 50 సంవత్సరాల పైబడిన వారికి, కోమార్బిడిటీస్ ఉన్నవారికి వాక్సిన్ ఇస్తారు. జిల్లా కలెక్టర్లు,  వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఈ ఏర్పాట్లను చూస్తున్నారు. వ్యాక్సిన్ కార్యక్రమం సజావుగా జరగడంలో మీరు భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రాధాన్యతా క్రమంలో వాక్సిన్ అందించడానికి మీరు, మీ స్థానిక ప్రజాప్రతినిధులందరూ ఈ  కార్యక్రమంలో క్రియాశీల పాత్ర పోషించాలని కోరుతున్నాము. వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా జరిగి, తెలంగాణ రాష్ట్రం కరోనా రహిత రాష్ట్రంగా మారాలనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్షను నెరవేర్చాలని అభ్యర్థిస్తున్నాను.” అంటూ సర్పంచ్‌లకు మంత్రి ఈటల రాజేందర్ లేఖ రారు.

Also read:

ప్రాణం తీసిన పతంగ్.. ”మాంజా” దారం మెడకు చుట్టుకొని ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి..

Sankranti: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి