Sankranti: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ మేరకు…
Sankranti: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ మేరకు మంగళవారం నాడు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగువారి సంస్కృతి సంప్రందాయాలకు, ప్రత్యేక కళలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతాంగాని మనమిచ్చే గౌరవానికి సంక్రాంతి పర్వదినం ప్రతీక అని అన్నారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను తెలుగు వారంతా సంతోషంగా జరపుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
ఇదిలాఉండగా, సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ తమ స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం నుంచి ఆంధ్రాకు భారీగా తరలి వెళ్తున్నారు. ప్రయాణకుల వాహనాలతో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై సందడి నెలకొంది. వేల కొద్ది వాహనాలు తరలి వెళ్తుండటంతో రద్దీ ఎక్కువగా ఉంది. మరోవైపు టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Also read:
Two Young Men Suicide: జీడిమెట్లలో విషాదం.. ఇద్దరు స్నేహితులు ఉరివేసుకుని ఆత్మహత్య..!