ప్రాణం తీసిన పతంగ్.. ”మాంజా” దారం మెడకు చుట్టుకొని ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి..

సంక్రాంతి వచ్చిందట పతంగులతో ఆకాశం అంతా రంగురంగులుగా మారుతుంది. కానీ పతంగులు ఎగరేసే సమయం లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

  • Rajeev Rayala
  • Publish Date - 9:20 pm, Tue, 12 January 21
ప్రాణం తీసిన పతంగ్.. ''మాంజా'' దారం మెడకు చుట్టుకొని ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి..

సంక్రాంతి వచ్చిందట పతంగులతో ఆకాశం అంతా రంగురంగులుగా మారుతుంది. కానీ పతంగులు ఎగరేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరదా ఒక్కొక్కసారి ప్రాణాలమీదకు కూడా వస్తుంది. తాజాగా ఓ వ్యక్తి పతంగ్ కారణంగా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న ఓ యువకుడి మెడకు ”మాంజా” దారం చుట్టుకుని గొంతు తెగడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

అజ్నిలోని ధ్యానేశ్వర్ నగర్‌కు చెందిన ప్రణయ్ ప్రకాశ్ తెహశీల్ ప్రాంతం నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రణయ్ మెడకు పదునైన పతంగి దారం చుట్టుకోవడంతో కిందపడిపోయాడు. గొంతు తెగి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించే లోగా అతడు మరణించాడు. ప్రమాదం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.