AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suicide Attempt: రెండేళ్లుగా కాపురానికి రాకుండా తల్లిగారింట్లోనే భార్య.. ముగ్గురు పిల్లలతో కలిసి హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన భర్త..

Suicide Attempt: వనపర్తి జిల్లా వీపనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య..

Suicide Attempt: రెండేళ్లుగా కాపురానికి రాకుండా తల్లిగారింట్లోనే భార్య.. ముగ్గురు పిల్లలతో కలిసి హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన భర్త..
Shiva Prajapati
|

Updated on: Jan 12, 2021 | 8:21 PM

Share

Suicide Attempt: వనపర్తి జిల్లా వీపనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. తానొక్కడే కాకుండా తన ముగ్గురు పిల్లల సహా ఆత్మహత్య చేసుకోవాలని భావించి విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా వీపనపల్లి మండలం వల్లభాపూర్ తండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. వల్లభాపూర్ తండాకు చెందిన సభవత్ చందునాయక్‌కు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంతకాలం వీరి కాపురం బాగానే సాగింది. కానీ, గత రెండేళ్లుగా చందునాయక్‌ భార్య.. తన పిల్లలను భర్తను వదిలేసి తల్లిగారింట్లోనే ఉంటోంది. ఆమెను ఇంటికి తీసుకువచ్చేందుకు చందు నాయక్ పలుమార్లు ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

దాంతో విసుగు చెందిన చందు నాయక్.. తన పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి దూకి చనిపోవాలని ఫిక్స్ అయ్యాడు. ఆ క్రమంతో తనతో పాటు పిల్లల్నీ కూడా స్తంభం ఎక్కించాడు. అయితే, చివరగా అప్రమత్తమైన చిన్నారి స్తంభం పైనుంచే తన పెదనాన్నకు ఫోన్ చేసింది. తాము చనిపోతున్నామని చెప్పింది. దాంతో ఆయన పోలీసులు సమాచారం అందించాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. చందునాయక్‌కు నచ్చజెప్పి న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. పోలీసుల హామీతో శాంతించిన చందునాయక్ తన పిల్లలతో కలిసి కిందకు దిగాడు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also read:

Ap Corona Update: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 197 పాజిటివ్‌ కేసులు.. మరణాల వివరాలు ఇలా..

Bowenpally Kidnap Case: కిడ్నాప్ కేసులో మరో సంచలన ట్విస్ట్.. జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్టు గుర్తింపు