Hyderabad: మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుడ్‌బాల్ మ్యాచ్.. అభిమానులకు పోలీసుల కీలక సూచన!
GOAT ఇండియా టూర్ 2025'లో భాగంగా డిసెంబర్ 13న ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మేస్సీ హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆరోజు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఫ్రెండ్లీ ఫుడ్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. అయితే ఈ మ్యాచ్ చేసేందుకు భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. కేవసం ఎంట్రీ పాసులు ఉన్న అభిమానులు మాత్రమే స్టేడివం వద్దకు రావాలని కోరారు.

GOAT ఇండియా టూర్ 2025’లో భాగంగా డిసెంబర్ 13న ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మేస్సీ హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆరోజు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఫ్రెండ్లీ ఫుడ్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు.ఇక్కడికి సీఎం కూడా రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోభస్తు ఏర్పాటు చేశారు.ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ రాచకొండ సీపీ సుదీర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు కేవలం పాసులు ఉన్న అభిమానులు మాత్రమే రావాలని.. పాస్ లేకుంటే ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. టికెట్, పాసులు ఉన్న వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, వారికి మాత్రమే అనుమతి ఉంటుందని.. మిగతా వారికి ఎట్టి పరిస్థితి లో అనుమతి ఉండదని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ నెల 13న జరుగుతున్న ఈ మ్యాచ్ కు అత్యంత కట్టుదిట్టమైన, భారీ బందో బస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. ఇందుకు అభిమానులు కూడా సహకరించాలని ఆయన కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




