AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లోని మూసాపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం! 60 బైకులు దగ్ధం

హైదరాబాద్‌లోని మూసాపేట్ గూడ్స్ షెడ్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించి 60 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తేగా, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని మూసాపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం! 60 బైకులు దగ్ధం
Moosapet Fire Accident
SN Pasha
|

Updated on: Jun 16, 2026 | 5:29 PM

Share

హైదరాబాద్ నగరంలోని మూసాపేట్ గూడ్స్ షెడ్ ప్రాంతంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు నిల్వ ఉంచిన ఓ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గోదాం నుంచి భారీగా దట్టమైన పొగ ఎగసిపడుతూ కనిపించడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గోదాంలో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఫైర్ ఇంజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కొన్ని గంటల శ్రమ తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.

ఈ ప్రమాదంలో సుమారు 60 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదం సంభవించిన సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో పెద్ద విషాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ సర్వీస్ సెంటర్‌కు చెందిన గోదాంను యాజమాన్యం గత ఎనిమిది నెలలుగా మూసివేసి ఉంచినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అక్కడ వాహనాలు నిల్వ ఉండటం గమనార్హం. షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నప్పటికీ, ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో విచారణ చేపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఫ్రెండ్‌షిప్ డే.. మరో కొత్త వీడియోలో ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
ఫ్రెండ్‌షిప్ డే.. మరో కొత్త వీడియోలో ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?