AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కోళ్ల గూడు నుంచి వింత శబ్దాలు.. తీరా చూస్తే కదలకుండా ఉన్న పెద్ద నాగుపాము.. కట్‌చేస్తే..

ఎప్పటిలాగే ఉదయాన్నే కోళ్లను బయటకు వదులుదామని వెళ్లిన ఆ ఇంటి యజమానికి కోడి కూతకు బదులు భయంకరమైన బుసల శబ్దం వినిపించింది. తీరా లోపలికి వెళ్లి చూస్తే.. పడగ విప్పిన భారీ నాగుపాము.. అయితే అది కదలలేని స్థితిలో ఉండిపోయింది. అప్పటికే కోడిని చంపి, ఏకంగా తొమ్మిది కోడిగుడ్లను మింగేసింది. ఆ తర్వాత జరిగిన హై డ్రామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Telangana: కోళ్ల గూడు నుంచి వింత శబ్దాలు.. తీరా చూస్తే కదలకుండా ఉన్న పెద్ద నాగుపాము.. కట్‌చేస్తే..
Massive Cobra Swallows 9 Eggs
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: May 18, 2026 | 9:36 PM

Share

వనపర్తి జిల్లా పానగల్ మండలం చింతకుంట గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారీ నాగుపాము జనవాసాల్లోకి చొరబడి, కోళ్ల గూటిపై దాడి చేయడమే కాకుండా.. అందులోని కోడిగుడ్లను అమాంతం మింగేసింది. అయితే అతిగా మింగేసిన గుడ్ల వల్ల ఆ పాము కదలలేని స్థితికి చేరుకోవడంతో చివరికి స్నేక్ క్యాచర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. గ్రామానికి చెందిన యాదగిరి స్వామి తన ఇంట్లో కోళ్లను పెంచుకుంటున్నారు. ఎప్పటిలాగే కోళ్లను బయటకు వదలడానికి వెళ్లిన అతడికి కోళ్ల అరుపుల బదులు భయంకరమైన బుసల శబ్దాలు వినిపించాయి. లోపలికి వెళ్లి చూడగా.. పెద్ద నాగుపాము పడగ విప్పి కనిపించడంతో ఆయన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

9 గుడ్లు మింగేసి.. లాక్ అయిపోయి

ఆకలితో ఉన్న ఆ నాగుపాము అప్పటికే గూటిలోని ఒక కోడిపెట్టను కరిచి చంపేసింది. అంతేకాకుండా అందులో ఉన్న 9 కోడిగుడ్లను ఒకదాని వెనుక ఒకటి మింగేసింది. ఆ గుడ్ల బరువు, పరిమాణం వల్ల పాము శరీరం ఉబ్బిపోయి, అటు ముందుకు ఇటు వెనుకకు కదలలేని స్థితిలో చిక్కుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు భారీ పామును చూడటానికి యాదగిరి స్వామి ఇంటికి క్యూ కట్టారు. వెంటనే స్నేక్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు చీర్ల కృష్ణసాగర్‌కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఆయన కోళ్ల గూటి నుంచి పామును బయటకు తీశారు. దాని పొట్టపై మెల్లిగా ఒత్తిడి తీసుకురావడంతో పాము మింగిన 9 గుడ్లను బయటకు కక్కేసింది. దీంతో పాము తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. అనంతరం ఆ నాగుపామును సమీపంలోని అడవి ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.

పాములు కనిపిస్తే చంపకండి

ఈ సందర్భంగా కృష్ణసాగర్ మాట్లాడుతూ.. వేసవి కాలం లేదా వర్షాకాలంలో పాములు ఆహారం కోసం జనవాసాల్లోకి రావడం సహజమని, వాటిని చూసి భయాందోళన చెందవద్దని కోరారు. పాములను చంపకుండా తమకు సమాచారం అందిస్తే, వాటిని రక్షించి అడవిలో వదిలేస్తామని గ్రామస్తులకు సూచించారు. సమయానికి స్పందించి నాగుపాము ప్రాణాలు కాపాడిన కృష్ణసాగర్‌ను గ్రామస్తులు అభినందించారు.

Follow Us
కోళ్ల గూడు నుంచి వింత శబ్దాలు.. తీరా చూస్తే కదలకుండా ఉన్న..
కోళ్ల గూడు నుంచి వింత శబ్దాలు.. తీరా చూస్తే కదలకుండా ఉన్న..
ఆమెతో స్పెషల్ సాంగ్.. దెబ్బకు 365 రోజులు థియేటర్లు హౌస్‌ఫుల్..
ఆమెతో స్పెషల్ సాంగ్.. దెబ్బకు 365 రోజులు థియేటర్లు హౌస్‌ఫుల్..
ద్యావుడా కదిలే రైలులోనే వట సావిత్రి వత్రం చేసిన మహిళ!వీడియో వైరల్
ద్యావుడా కదిలే రైలులోనే వట సావిత్రి వత్రం చేసిన మహిళ!వీడియో వైరల్
అవసరం ఉన్నప్పుడే మీతో మాట్లాడుతున్నారా? మీ ప్రేమ డేంజరే
అవసరం ఉన్నప్పుడే మీతో మాట్లాడుతున్నారా? మీ ప్రేమ డేంజరే
కష్టపడినా గుర్తింపు రావట్లేదా? బుధ గ్రహ అనుగ్రహం ఇలా చేయండి
కష్టపడినా గుర్తింపు రావట్లేదా? బుధ గ్రహ అనుగ్రహం ఇలా చేయండి
నడి రోడ్డుపై యోగా స్టంట్,చేతులు, కాళ్లు ముడుచుకుని స్కూటర్ నడిపిన
నడి రోడ్డుపై యోగా స్టంట్,చేతులు, కాళ్లు ముడుచుకుని స్కూటర్ నడిపిన
యంగ్ హీరో మంచి మనసు..
యంగ్ హీరో మంచి మనసు..
మందార పువ్వుతో పాటు ఇది కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
మందార పువ్వుతో పాటు ఇది కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
ఏసీ ఆపినా గది చల్లగా ఉండాలా.. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే కరెంట్
ఏసీ ఆపినా గది చల్లగా ఉండాలా.. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే కరెంట్
మోటార్‌సైకిల్ తయారీ హబ్‌గా ఏపీ! 2,508 కోట్ల పెట్టుబడి, వేల జాబ్స్
మోటార్‌సైకిల్ తయారీ హబ్‌గా ఏపీ! 2,508 కోట్ల పెట్టుబడి, వేల జాబ్స్