అక్కడి కుర్రాళ్లంటే క్రష్.. మనసులో మాట బయటపెట్టిన శ్రీలీల..

Rajitha Chanti

Pic credit - Instagram

18 May 2026

టాలీవుడ్ యాంగ్ అండ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో రాణిస్తుంది.

తన క్యూట్ లుక్స్, అద్భుతమైన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. 

టాలీవుడ్ లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆడిపాడిన శ్రీలీల, ఇటీవల కోలీవుడ్ (తమిళం), బాలీవుడ్ లలో కూడా అడుగుపెట్టి గుర్తింపు సంపాదించుకుంది. 

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి ప్రణాళికలు చెన్నై కనెక్షన్ గురించి శ్రీలీల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. 

సాధారణంగా గ్లామర్ ఇండస్ట్రీలో హీరోయిన్ల పెళ్లి గురించి రూమర్స్ రావడం సహజం. గతంలో శ్రీలీల వివాహంపై కొన్ని వార్తలు రాగా ఆమె వాటిని ఖండించింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన రాగా శ్రీలీల ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తనకు చెన్నై కుర్రాళ్లంటే క్రష్ ఉందని మనసులో మాట బయటపెట్టింది.

"లేడీ సూపర్ స్టార్ నయనతారలాగా నేను కూడా చెన్నైలోనే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతానా?" అంటూ సరదాగా చెప్పుకొచ్చిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

 'పెళ్లి సందD' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల.. మహేష్ బాబు, రవితేజ వంటి స్టార్ల సరసన నటించి మెప్పించింది.