AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడి రోడ్డుపై యోగా స్టంట్.. చేతులు, కాళ్లు ముడుచుకుని స్కూటర్ నడిపిన కేటుగాడు.. వీడియో వైరల్!

సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం లేదా రీల్స్ పిచ్చితో కొందరు యువకులు చేసే పనులు చూస్తే ఆశ్చర్యంతో పాటు తీవ్ర భయం కూడా వేస్తుంది. తమ ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై వెళ్లే తోటి వాహనదారుల ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చేలా ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఒక విస్తుపోయే ఘటనే వెలుగుచూసింది. ఒక వ్యక్తి స్కూటర్ హ్యాండిల్‌ను అస్సలు చేతులతో పట్టుకోకుండా, విచిత్రమైన భంగిమలో వాహనాన్ని నడిపి అందరినీ షాక్‌కు గురిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వేగంగా చక్కర్లు కొడుతోంది.

నడి రోడ్డుపై యోగా స్టంట్.. చేతులు, కాళ్లు ముడుచుకుని స్కూటర్ నడిపిన కేటుగాడు.. వీడియో వైరల్!
Lucknow Scooter Stunt
Jyothi Gadda
|

Updated on: May 18, 2026 | 9:23 PM

Share

సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం లేదా రీల్స్ పిచ్చితో కొందరు యువకులు చేసే పనులు చూస్తే ఆశ్చర్యంతో పాటు తీవ్ర భయం కూడా వేస్తుంది. తమ ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై వెళ్లే తోటి వాహనదారుల ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చేలా ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఇలాంటి ఒక విస్తుపోయే ఘటనే వెలుగుచూసింది. ఒక వ్యక్తి స్కూటర్ హ్యాండిల్‌ను అస్సలు చేతులతో పట్టుకోకుండా, విచిత్రమైన భంగిమలో వాహనాన్ని నడిపి అందరినీ షాక్‌కు గురిచేశాడు.

ఈ భయానక దృశ్యం లక్నోలోని లోహియా పథ్ ఎక్స్‌ప్రెస్‌వే పరిసర ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి వేగంగా వెళ్తున్న స్కూటర్‌పై సీటు వెనుక భాగంలో కూర్చున్నాడు. అతను తన రెండు కాళ్లను సీటుపైకి మడతపెట్టి, చేతులను కూడా ముడుచుకుని పూర్తిగా యోగాసనం వేసినట్లు కూర్చున్నాడు. వాహనం బ్యాలెన్స్ తప్పుతుందనే భయం ఏమాత్రం లేకుండా, కేవలం శరీరం బరువును అటూ ఇటూ తిప్పుతూ స్కూటర్‌ను నియంత్రించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

రద్దీగా ఉండే రోడ్డుపై ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించిన సదరు వ్యక్తిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. వెనుక కారులో వస్తున్న వారు ఈ స్టంట్‌ను వీడియో తీసి ఈయనకు లక్నో పోలీసుల నుండి చలాన్ గిఫ్ట్ అందాలి అనే శీర్షికతో ఎక్స్‌ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.

ఈ వీడియో లక్నో ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే స్పందించారు. సదరు వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు వ్యక్తిపై భారీ జరిమానా (చలాన్) తో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇలాంటి స్టంట్లు రోడ్లపై సాహసాలు కావు, ఆత్మహత్యాసదృశ్యాలు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒక్క క్షణం బ్యాలెన్స్ తప్పినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, కేవలం ప్రచారం కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us