AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indravelli: ‘ఇంద్రవెళ్లి స్థూపాన్ని‌ అపవిత్రం చేశారు’.. పాలాభిషేకం చేసిన తుడుందెబ్బ.. వీడియో

కాంగ్రెస్ పునర్నిర్మాణ సభ పేరిట.. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న ఇంద్రవెళ్లి సభ వివాదాస్పదమైంది. ఆదివాసీల సంప్రదాయాలు అసలే తెలియని కొందరు వ్యక్తులు.. ఇంద్రవెళ్లి అమరవీరుల స్తూపాన్ని కాళ్లకు చెప్పులతో , బూట్లతో ఎక్కి అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది తుడుందెబ్బ.

Indravelli: 'ఇంద్రవెళ్లి స్థూపాన్ని‌ అపవిత్రం చేశారు'.. పాలాభిషేకం చేసిన తుడుందెబ్బ.. వీడియో
Martyrs Of Indraveli Stupam
Naresh Gollana
| Edited By: |

Updated on: Feb 03, 2024 | 7:52 PM

Share

కాంగ్రెస్ పునర్నిర్మాణ సభ పేరిట.. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న ఇంద్రవెళ్లి సభ వివాదాస్పదమైంది. ఆదివాసీల సంప్రదాయాలు అసలే తెలియని కొందరు వ్యక్తులు.. ఇంద్రవెళ్లి అమరవీరుల స్తూపాన్ని కాళ్లకు చెప్పులతో , బూట్లతో ఎక్కి అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది తుడుందెబ్బ. మరొసారి ఇలాంటివి రిపీట్ అయితే కఠి‌న చర్యలుంటాయంటూ హెచ్చరించింది. అధికారులు సైతం ఆదివాసీ సంప్రదాయాలకు , నమ్మకాలకు గౌరవం ఇవ్వకుండా బూట్లతో ఇంద్రవెళ్లి స్తూపాన్ని తాకి అపవిత్రం చేశారని.. బూట్లతో ఇంద్రవెళ్లి అమరవీరుల స్తూపం‌ వద్దకు రావడమే నిషేధం అని.. అలాంటిది ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఇంద్రవెళ్లి స్తూపాన్ని అగౌరవ పరిచారంటూ మండి పడింది తుడుందెబ్బ. పాలతో స్తూపాన్ని శుద్ది చేసి పూజ కార్యక్రమాలను నిర్వహించింది. ప్రభుత్వమైన , అదికారులైనా చివరికి ప్రతిపక్ష నేతలైనా ఆదివాసీ సంప్రదాయాలను పాటించకుండా పవిత్రమైన ఇంద్రవెళ్లి అమర వీరుల స్తూపానికి గౌరవం ఇవ్వకుండా ఇష్ఠారీతిన వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరించింది.

తుడుందెబ్బ నాయకుడు పుర్క బాపురావు మాట్లాడుతూ ‘ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నిన్న కొంతమంది నాయకులు చెప్పులతో, బూట్లతో స్తూపం వద్ద మెట్లెక్కి అపవిత్రం చేశారు.. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. కనీస గౌరవం‌ ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యవహరించడన్ని తుడుందెబ్బ తీవ్రంగా ఖండిస్తుంది. ఇంద్రవెళ్లి‌ అమరవీరుల స్తూపం వద్ద స్మృతి‌వనం శంకుస్థాపన పేరిట ప్రభుత్వ అదికారులు అతిగా ప్రవర్తించారు.. సీఎం వచ్చిన సమయంలో కొందరు కాంగ్రెస్ నేతలు, అధికారులు, పోలీస్ అదికారులు‌ బూట్లతో స్తూపం పైకి వచ్చి అపవిత్రం చేశారు. మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకూడదు’ అనిహెచ్చరించారు . అమరవీరుల ఆత్మస్థలిని అపవిత్ర చేసినందుకు పాలతో స్తూపాన్ని.. ఇంద్రవెళ్లి‌ స్మృతి‌వన ఆవణరాన్ని శుద్ధి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయ సాధన కమిటీ చైర్మన్ తోడషం నాగోరావ్, ఆదివాసి హక్కుల పోరట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు పుర్క బాపురావ్ , జిల్లా ఉపాధ్యక్షులు గేడం బారత్, తుడుందెబ్బ ఇంద్రవెల్లి మండల అద్యక్షులు జుగ్నాక్ బారత్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పాలాభిషేకం చేస్తోన్న తుడుందెబ్బ సభ్యులు..