Telangana: కొంప ముంచిన దావత్.. డబ్బులు చెల్లించమనడంతో సెల్ టవర్ ఎక్కిన యువకుడు
చివరకు ఉరిమి ఉరిమి మంగళంమీద పడ్డట్టు.. దావత్ ఖర్చు తిరిగి ఇవ్వాలని అనడంతో తోటి స్నేహితుడు భయాందోళనకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. జోగిపేటకు చెందిన నర్సింహులు అనే వ్యక్తి...
ఫ్రెండ్స్ అన్నాక దావత్‌లు చేసుకోవడం కామన్. పండగొచ్చినా.. పబ్బమొచ్చినా ఫ్రెండ్స్ పార్టీలు చేసుకోవాల్సిందే స్నేహితులు గ్రూప్‌గా ఏర్పడి పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాగే ఓ వ్యక్తి సైతం తన స్నేహితులకు దావత్ ఇచ్చాడు. అయితే ఇతను చేసిన పొరపాటు వల్ల భార్య దగ్గర అడ్డంగా బుక్కయ్యాడు.
చివరకు ఉరిమి ఉరిమి మంగళంమీద పడ్డట్టు.. దావత్ ఖర్చు తిరిగి ఇవ్వాలని అనడంతో తోటి స్నేహితుడు భయాందోళనకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. జోగిపేటకు చెందిన నర్సింహులు అనే వ్యక్తి.
దావత్ ఇచ్చిన డబ్బులను తిరిగి అడిగినందుకు సెల్ టవర్ ఎక్కాడు ఓ యువకుడు. ఇంట్లో నుంచి భార్యకి తెలియకుండా 20 వేల రూపాయలు తీసుకెళ్లి తన ఫ్రెండ్స్‌కి దావత్ ఇచ్చాడు నర్సింహులు అనే వ్యక్తి. అనంతరం భార్య డబ్బుల గురించి అడగ్గా తన ఫ్రెండ్స్‌కి దావత్ ఇచ్చిన విషయం చెప్పాడు భర్త నర్సింహులు. వెంటనే అతని భార్య.. భర్త స్నేహితుడైన మహేష్‌కి ఫోన్ చేసి మీకు మా ఆయన దావత్ ఇచ్చిన డబ్బులని వెంటనే ఇవ్వాలని అడిగింది. లేకుంటే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. దీంతో భయపడ్డ మహేష్ సెల్ టవర్ ఎక్కి తోటి స్నేహితులకి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
దీంతో వెంటనే తెలుసుకున్న స్నేహితులతో పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. అనంతరం పోలీసులను వెంటపెట్టుకొని వెళ్లి, సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎలాగోలా నచ్చజెప్పి మహేష్‌ను కిందకు దించడంతో కథ సుఖాంతమైంది. ఈ విషయం తెలిసిన స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..