AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: ఫ్యామిలీ ప్యాకేజీ.. ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ.. మరి అధిష్టానం నిర్ణయమేంటి..?

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎంపీ సీట్ల కోసం పలు కుటుంబాలు పోటీ పడుతుండటం.. కొందరు ఆశావహులు ఆయా సీట్లను ఆశిస్తుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాజకీయాలలో ఉన్న ఆ నేతలకు తమ బంధువర్గం నుంచి కొత్తతరం నేతలను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు..

Telangana Congress: ఫ్యామిలీ ప్యాకేజీ.. ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ.. మరి అధిష్టానం నిర్ణయమేంటి..?
Telangana Congress
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Feb 05, 2024 | 3:46 PM

Share

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎంపీ సీట్ల కోసం పలు కుటుంబాలు పోటీ పడుతుండటం.. కొందరు ఆశావహులు ఆయా సీట్లను ఆశిస్తుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాజకీయాలలో ఉన్న ఆ నేతలకు తమ బంధువర్గం నుంచి కొత్తతరం నేతలను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు.. ఓకటి రెండు కుటుంబాల నుంచి నేతలు దరఖాస్తు చేయడంతో మిగతా నేతలు కూడా తమవారికి టికెట్ ఇవ్వాలని పట్టు బడుతున్నారు.. ఈ లిస్ట్‌లో కొత్త నేతలతో పాటు తలపండిన నేతలు కూడా ఉన్నారు.

ఖమ్మం ఎంపీ టిక్కెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని దరఖాస్తు చేసుకున్నారు. తనకే టిక్కెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి కూడా ఖమ్మం ఎంపీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసారు. ఇలా ఇద్దరు మంత్రుల కుటుంబాల నుంచి ఓకే టిక్కెట్ కోసం పోటీ పడుతుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

మరో నేత జానారెడ్డి కుమారుడు రణవీర్ రెడ్డి కూడా నల్లగొండ ఎంపీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసారు. జానారెడ్డి రెండో కుమారుడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.. కాగా ఇదే టిక్కెట్‌ను కోమటిరెడ్డి ఫ్యామిలీ కూడా అడుగుతుందట.. టిక్కెట్‌కు ఓకే చెప్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లేదంటే తమ కుటుంబం నుంచే మరోనేతను దింపుతామని చెప్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి కుటుంబం నుంచి వెంకట్‌రెడ్డి మంత్రిగా.. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు. ఇక మరోనేత భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కూతురు కీర్తిరెడ్డి కూడా భువనగిరి ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు.. ఇప్పటికే గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకున్న కీర్తి రెడ్డి టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు.

మల్కాజ్‌గిరి టిక్కెట్ కోసం మైనంపల్లి హాన్మంతరావు దరఖాస్తు చేసుకోగా మైనంపల్లి కొడుకు ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నాగర్ కర్నూలు ఎంపీ టిక్కెట్ కోసం మల్లు రవి దరఖాస్తు చేసుకున్నారు. మల్లు రవి బ్రదరే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సికింద్రాబాద్ టిక్కెట్ కోసం అనీల్ యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనీల్ తండ్రి అంజన్ ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరోమంత్రి దామోదర రాజనర్సింహ కూతురు త్రిష మెదక్ టికెట్ ఆశిస్తుండగా.. జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి కూడా ఆ టిక్కెట్‌నే ఆశిస్తున్నారని సమాచారం.. అయితే, ఈ ఇద్దరు నేతలు దరఖాస్తు చేయలేదు.. కానీ టిక్కెట్ మాత్రం అడుగుతున్నారని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే కేసీఆర్‌ను కుటుంబ పాలన అని విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు అదే కుటుంబ పాలన దిశగా వెళ్తుందా.. అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ప్రస్తుతం పార్టీలో పదవులు అనుభవిస్తున్న నేతలే.. వారి కుటుంబసభ్యుల కోసం టిక్కెట్లు అడగడం అనేక విమర్శలకు దారితీస్తోంది.. అయితే, అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..