AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumari Aunty: హోటల్‌ పెట్టకముందు ఆ సింగర్‌ ఇంట్లో పనిచేశా.. అమ్మానాన్నల్లా చూసుకున్నారు: కుమారీ ఆంటీ

కుమారీ ఆంటీ అలియాస్‌ దాసరి సాయి కుమారీ.. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఇవిడే ట్రెండింగ్‌. మాదాపూర్‌ కేబుల్‌ బ్రిడ్జి సమీపంలో స్ట్రీడ్‌ ఫుడ్‌ బిజినెస్‌ చేసే ఆమె సామాజిక మాధ్యమాల పుణ్యమా అని సెలబ్రిటీగా మారిపోయింది. యూట్యూబర్లు ఎగబడి వీడియోలు, రీల్స్‌ తీయడంతో ఆమె ఫుడ్‌ స్టాల్‌కు బాగా గిరాకీ వచ్చి పడింది.

Kumari Aunty: హోటల్‌ పెట్టకముందు ఆ సింగర్‌ ఇంట్లో పనిచేశా.. అమ్మానాన్నల్లా చూసుకున్నారు: కుమారీ ఆంటీ
Kumari Aunty
Basha Shek
|

Updated on: Feb 05, 2024 | 3:28 PM

Share

కుమారీ ఆంటీ అలియాస్‌ దాసరి సాయి కుమారీ.. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఇవిడే ట్రెండింగ్‌. మాదాపూర్‌ కేబుల్‌ బ్రిడ్జి సమీపంలో స్ట్రీడ్‌ ఫుడ్‌ బిజినెస్‌ చేసే ఆమె సామాజిక మాధ్యమాల పుణ్యమా అని సెలబ్రిటీగా మారిపోయింది. యూట్యూబర్లు ఎగబడి వీడియోలు, రీల్స్‌ తీయడంతో ఆమె ఫుడ్‌ స్టాల్‌కు బాగా గిరాకీ వచ్చి పడింది. ఎంతలా అంటే తినడానికి వచ్చిన వాహనదారులతో రోడ్డు ట్రాఫిక్‌ జామ్‌ కావడం, పోలీసులు ఆమె స్టాల్‌ను క్లోజ్‌ చేయంచడం, ఆపై సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా స్పందించడంతో ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు కుమారీ ఆంటీ. అంతేకాదు వీలు చూసుకుని ఆమె ఫుడ్‌ స్టాల్‌ను సందర్శిస్తానిని ముఖ్యమంత్రి చెప్పినట్లు ప్రచారం జరగడంతో కుమారీ ఆంటీ క్రేజ్‌ నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్లిపోయింది. ప్రస్తుతం నగరంలో ఎక్కడెక్కడి నుంచో జనాలు ఆమె చేతి వంట రుచి చూసేందుకు క్యూ కడుతున్నారు. ఇన్‌స్టా, ఫేస్‌ బుక్‌, యూట్యూబ్‌.. ఎక్కడ చూసినా కుమారీ ఆంటీ ఫుడ్‌ స్టాల్ వీడియోలే దర్శనమిస్తున్నాయి. అయితే ఈ చిన్న పాటి హోటల్‌ ప్రారంభించడానికి ముందు టాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ హేమ చంద్ర ఇంట్లో కుమారీ ఆంటీ పని చేసిందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

‘ నేను 2009లో హైదరాబాద్‌కు వచ్చాను. అప్పుడు దుస్తులు కుట్టేదాన్ని. అదే సమయంలో ప్రముఖ గాయకుడు హేమ చంద్ర ఇంట్లో వంట పని చేయడానికి వెళ్లేదాన్ని. హేమ చంద్ర తల్లి నన్ను చాలా బాగా చూసుకునేది. ఇంత అమాయకురాలిగా ఉన్నావు? ఇలాగైతే ఎలా బతుకుతావు? అనేవారు. మా అమ్మానాన్నల్లాగా ఆమె ఎంతో ప్రేమగా చూసుకునేది. నాకు ఏదైనా తెలియకపోతే ఇలా చేయాలి, అలా చేయాలని సలహాలు ఇచ్చేవారామె. ఆమె చాలా మంచి వారు. రెండేళ్ల తర్వాత అంటే 2011లో రోడ్డు పక్కన చిన్న హోటల్‌ స్టార్ట్‌ చేశాం. భోజనం, రకరకాల కూరలు అమ్మడం ప్రారంభించాం. మొదటి నుంచి సినిమా, సీరియల్‌ సెలబ్రిటీలు మా దగ్గర భోజనం తీసుకెళ్లేవాళ్లు’ అని అప్పటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంది కుమారీ ఆంటీ.

ఇవి కూడా చదవండి

కుమారీ ఆంటీకి మద్దతుగా సందీప్ కిషన్ ట్వీట్..

కుమారీ ఆంటీ స్టాల్ వద్ద భోజనం చేస్తోన్న సందీప్ కిషన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం