AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాలసిస్ చికిత్స కోసం వెళితే HIV సోకింది..! మణుగూరులో దారుణ ఘటన..

మణుగూరులోని 100 పడకల ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స తీసుకుంటున్న వృద్ధుడికి HIV సోకిన ఘటన కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు చేస్తున్నారు. ఆసుపత్రి అధికారులు విచారణకు ఆదేశించారు. రోగి గతంలో వరంగల్, హైదరాబాద్ ఆసుపత్రులలో చికిత్స పొందినట్లు తెలుస్తోంది.

డయాలసిస్ చికిత్స కోసం వెళితే HIV సోకింది..! మణుగూరులో దారుణ ఘటన..
Hiv
N Narayana Rao
| Edited By: |

Updated on: Sep 06, 2025 | 8:44 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో దారుణం చోటు చేసుకుంది. రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చికిత్స తీసుకుంటున్న ఓ వృద్ధుడికి హెచ్ఐవి సోకడం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తుంది. మణుగూరు ఆసుపత్రి కి వెళ్లిన డయాలసిస్ రోగికి హెచ్ఐవి సోకింది. గత ఏడు నెలలుగా రోగి కి చికిత్సనందిస్తున్న సిబ్బంది, డయాలసిస్ కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి హెచ్ఐవి సోకిందని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రోగి వేరే ఆసుపత్రికి వెళ్లాడని సిబ్బంది అంటున్నారు. తమ దగ్గరికి రాకముందు రోగి హైద్రాబాద్, వరంగల్ లో చికిత్స పొందడని మణుగూరు ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు అంటున్నారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రి వద్ద రోగి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. డాక్టర్లు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకొని ఘటన పై విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అశ్వాపురం మండలానికి చెందిన ఓ వృద్ధుడు తన రోడ్డు కిడ్నీలు పాడైపోవడంతో గత కొన్ని నెలలుగా డయాలసిస్ చికిత్స చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వరంగల్, హైదరాబాద్లలోని హాస్పిటల్స్ లో చికిత్స తీసుకున్న అనంతరం గత ఏడు నెలలుగా మణుగూరు లోని 100 పడకల హాస్పిటల్ లో డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు, ఇటీవల చికిత్స చేయించుకునేందుకు వచ్చిన వృద్ధుడికి రక్త పరీక్షలు నిర్వహించగా హెచ్ఐవి ఉన్నట్లుగా బయటపడింది, దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా చికిత్స చేయించుకుంటున్న ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఇలాంటి రిపోర్టు రాలేదని, ఇది కేవలం డయాలసిస్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రికి హెచ్ఐవి సోకిందని వృద్ధుడి కుమార్తె ఆరోపిస్తున్నారు.

ఇదే విషయంపై హాస్పిటల్లోని డాక్టర్లు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు రోగి కుటుంబ సభ్యులు, ప్రస్తుతం తన తండ్రికి హెచ్ఐవి సోకడం మూలంగా డయాలసిస్ చికిత్స అందడం లేదని, తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని రోగి కుమార్తె అంటున్నారు. ఇదే విషయమై మణుగూరు హాస్పిటల్ సూపర్డెంట్ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. జరిగిన ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, పొరపాటు ఎక్కడ జరిగిందో విచారణ జరిపి అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..