AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: బట్టి vs రేణుక.. ఖమ్మం కాంగ్రెస్‌లో కోల్డ్ వార్.. గందరగోళంలో క్యాడర్.. 

Mallu Bhatti Vikramarka vs Renuka Chowdhury: ఖమ్మం కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఆ ఇద్దరు నేతల మధ్య కయ్యమేనట.. ఆ గట్టునుంటవా, నాగన్న ఈ గట్టునుంటవా అన్నట్లు క్యాడర్‌కు ఎప్పుడూ కన్ఫ్యూజనేనట. ఎటూ ఉండలేక

Telangana Congress: బట్టి vs రేణుక.. ఖమ్మం కాంగ్రెస్‌లో కోల్డ్ వార్.. గందరగోళంలో క్యాడర్.. 
Mallu Bhatti Vikramarka Vs
Ashok Bheemanapalli
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Dec 06, 2021 | 3:02 PM

Share

Mallu Bhatti Vikramarka vs Renuka Chowdhury: ఖమ్మం కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఆ ఇద్దరు నేతల మధ్య కయ్యమేనట.. ఆ గట్టునుంటవా, నాగన్న ఈ గట్టునుంటవా అన్నట్లు క్యాడర్‌కు ఎప్పుడూ కన్ఫ్యూజనేనట. ఎటూ ఉండలేక కలవర పడుతున్నరట కాంగ్రెస్‌ శ్రేణులు.. ఖమ్మం కాంగ్రెస్ క్యాడర్‌ను కలవరపెడుతోందట మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీరు. ఈ ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడూ పీక్‌కు చేరినట్లు కనిపిస్తోంది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నిక నుంచి మొదలైన ఈ వార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలతో మరింత ముదిరిందని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పే.. జిల్లా కీలక నేతలే ఇలా పోటా పోటీగా ఉండటంతో నేతలకు, శ్రేణులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదని టాక్‌ వినిపిస్తోంది.

అయితే మొదటి నుంచి కూడా ఈ ఇద్దరి నాయకుల మధ్య ఆధిపత్య పోరు కనిపించింది. ఇండైరెక్టుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉండేవారు. గతంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా రేణుక చౌదరి బాహాటంగానే ఎన్నికల్లో పోటీ చేసినవారి గురించి మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికల్లో నిజమైన కాంగ్రెస్ వాళ్లకు టికెట్స్ ఇవ్వలేదని నెక్స్ట్ టైం అలా జరగకుండా చూస్తానంటూ పేర్కొన్నారు. నిజమైన కాంగ్రెస్ నాయకులకి అన్యాయం చేశారని బట్టిని టార్గెట్ చేస్తూ విమర్శించారు. అయితే.. ఆ మీటింగ్ లో అప్పటి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తో పాటు మాణిక్యం ఠాగూర్ కూడా ఉన్నారు. ఇక ఖమ్మం డీసీసీ విషయంలో కూడా వార్ నడిచింది. బట్టి విక్రమార్క పట్టు బట్టి మరి పువ్వాళ్ల దుర్గ ప్రసాద్‌ను నియమించారు. అయితే దుర్గ ప్రసాద్ నియామకాన్ని కూడా రేణుక వ్యతిరేకించరట. నా అభిప్రాయం లేకుండా ఎలా నియమిస్తారంటూ రేణుక బట్టిపై ఫైర్‌ అయ్యారని సమాచారం.

పీసీసీ చీఫ్‌గా రేవంత్ వచ్చిన తర్వాత ఈ ఇద్దరు నేతల మధ్య వార్ మరింత పెరిగిందనే టాక్ ఉంది. డీసీసీ అధ్యక్షుడి నియామకం నుంచి ఇప్పుడు ఎంఏల్సీ ఎన్నికల్లో పోటీ వరకు ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదరట్లేదని సమాచారం. పైగా రేవంత్ పీసీసీ అయిన తరువాత బట్టికి తెలియకుండా ఖమ్మం నేతలతో కలిసి రేణుక తన నివాసంలో విందును ఏర్పాటు చేశారని.. దీంతో ఇద్దరు కీలక నేతల మధ్య మరింత గ్యాప్‌ పెరిగిందని సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఈ ఇద్దరు నేతల మధ్య క్యాడర్ నలిగిపోతుందని పలువురు బహిరంగంగా పేర్కొంటున్నారు. కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాము కోపం అన్నట్టుగా క్యాడర్ పరిస్థితి ఉందని టాక్‌ వినిపిస్తోంది. అయితే.. ఈ ఇద్దరు కీలక నేతల మధ్య ఎప్పటికీ సయోధ్య కుదురుతుందో.. ఎప్పుడు కలిసి పనిచేస్తారో అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.