Shilpa Chowdary Cheating Case: శిల్పాచౌదరి కేసులో మరో మలుపు.. పోలీసుల విచారణకు రాధికా రెడ్డి డుమ్మా..

శిల్పాచౌదరి కేసులో నార్సింగి పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే రెండు రోజుల కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

Shilpa Chowdary Cheating Case: శిల్పాచౌదరి కేసులో మరో మలుపు.. పోలీసుల విచారణకు రాధికా రెడ్డి డుమ్మా..
Shilpa Chowdary
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 06, 2021 | 2:26 PM

కిట్టీ పార్టీలతో మొదలుపెట్టి.. కోట్లు కొల్లగొట్టిన శిల్పాచౌదరి కేసులో.. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్థాయిని పెంచుకునేందుకు ఎవరైనా ఏం చేస్తారు..? ఎవరైనా ఏమో గానీ శిల్పాచౌదరి మాత్రం ఇలా చేసింది. శిల్ప సిత్రాల్లో బౌన్సర్లను తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఈ రోజు విచారణకు రావాల్సిన రాధికా రెడ్డి మొహం చాటేశారు. సోమవారం డాక్యుమెంట్ల తో సహా వస్తానని చెప్పారు రాధికా రెడ్డి. శిల్పచౌదరి మీద ఫిర్యాదు చేస్తానన్నారు. రాధికా రెడ్డి రాకపోవడంతో శిల్పా కేసులో రాధికారెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారు నార్సింగి పోలీసులు.

అందుకు ఆధారాలుగా తన దగ్గరున్న చెక్కులు, వాట్సాప్‌ చాట్‌ను పోలీసులకు అందజేశారు. కేసు పెట్టి తనకు న్యాయం చేయాలంటూ కోరారు రాధికారెడ్డి. స్థాయిని పెంచుకునేందుకు ఎవరైనా ఏం చేస్తారు? శిల్ప సిత్రాల్లో బౌన్సర్లు తెరపైకి వచ్చారు. ఔను.. బిల్డప్‌ కోసం… స్టేటస్‌ సింబల్‌గా బౌన్సర్లను నియమించుకున్నట్టు చెప్పారు శిల్ప. మరో కొత్త విషయం ఏమిటంటే.. ఆమె రెండేళ్లు అమెరికాలో ఉండి వచ్చిందట. ఎందుకు వెళ్లారు.. ఎవరెవరు వెళ్లారు.. అక్కడ కూడా డీలింగ్స్‌ చేశారా.. అనే కోణంలో ఇప్పుడు పోలీసులు ఫోకస్‌ చేస్తున్నారు. తన లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అన్ని విషయాలను, రాధికారెడ్డి అనే రియల్టర్‌ మోసం చేసిందనే విషయాన్ని పూస గుచ్చినట్టు చెప్తున్న శిల్పా చౌదరి.. ఆర్థిక లావాదేవీలపై మాత్రం నోరు మెదపడం లేదు. తనని పోలీసులు అరెస్టు చేశాక.. మైండ్‌ బ్లాంక్‌ అయిందని.. జైలుకెళ్లాక మతిస్థితిమితం బాగోలేదంటూ చెప్తున్నారామె. రోజుకో డ్రామా… పూటకో మాటలో ఈ డైలాగ్‌ భాగమనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

బడా మహిళలతో జరిగిన కిట్టి పార్టీలఫై పోలీసులు ఆరా తీస్తున్నారు. శిల్పాచౌదరి కేసులో నార్సింగి పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే రెండు రోజుల కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. కస్టడీ ముగియడంతో పోలీసులు తిరిగి జైలుకు పంపించారు. మిగతా కేసులో పోలీసులు కస్టడీ కోరనున్నారు. ఇవాళ ఉప్పర్ పల్లి కోర్టులో నార్సింగి పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి: Health Benefits: అయ్యో..! నలుపు అని ఫీల్ అవుతున్నారా.. ఇందులో ఆశ్చర్యకరమైన వాస్తవాలు దాగున్నాయి..

Omicron Tension: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌.. 41 దేశాలకు పాకిన కొత్త వేరియంట్‌..!