Kishan Reddy: దళితబంధుపై కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించిన కిషన్ రెడ్డి.. ప్రజలు గమనిస్తున్నారంటూ వ్యాఖ్య..
Kishan Reddy: దళితబంధు పథకం అమలుపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావుపై కేంద్ర మంత్రి బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే దళితులను...
Kishan Reddy: దళితబంధు పథకం అమలుపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావుపై కేంద్ర మంత్రి బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే దళితులను కేసీఆర్ మభ్యపెట్టారని ఆరోపించారు. తాజాగా రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘హుజూరాబాద్ ఎన్నిక తరువాత దళిత బంధు ఎందుకు అమలు చేయడం లేదో కేసీఆర్ చెప్పాలి’ అంటూ ప్రశ్నించారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారన్న మంత్రి.. దళితులకు మేలు చేసే ఉద్దేశం ఉంటే తక్షణమే దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీపై నిందలు వేసి వరద బాధితులకు నష్టపరిహారం ఎగ్గొట్టారన్న కిషన్ రెడ్డి.. ఇప్పుడు మరోసారి బీజేపీ మీద నిందలు వేసి దళితబంధును పక్కన పెట్టారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరి తెలంగాణలో రాజకీయం బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ అన్నట్లు సాగుతోన్న వేళ దళితబంధు అంశం రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.
Also Read: Sonu Sood: రియల్ హీరోకు మరోసారి షాక్.. అక్రమంగా హోటల్ నిర్మించారంటూ..
Honour Killing: ప్రేమ వివాహం చేసుకుందని దారుణం .. సోదరి తల నరికి సెల్ఫీతో యువకుడి వికృతానందం..