Sonu Sood: రియల్ హీరోకు మరోసారి షాక్.. అక్రమంగా హోటల్ నిర్మించారంటూ..
రియల్ హీరో నటుడు సోనూసూద్‌కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి షాకిచ్చింది. ఆరు అంతస్తుల నిర్మాణాన్ని
రియల్ హీరో నటుడు సోనూసూద్‌కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి షాకిచ్చింది. ఆరు అంతస్తుల నిర్మాణాన్ని హోటల్‌గా మార్చారని సోనూసూద్‌కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ఆరు అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం కాగా.. దానిని హోటల్‌గా మార్చారని.. తిరిగి ఆ భవనాన్ని ఇంటిగా పునరుద్దరించాలని గుర్తుచేస్తూ.. నవంబర్ 15న నోటిసులు జారీ చేసింది బీఎంసీ.
మహారాష్ట్రకు చెందిన హక్కుల కార్యకర్త గణేశ్ కుస్ములు సోనూసూద్ పై బీఎంసీకి కంప్లైంట్ చేశారు. రెసిడెన్షియల్ భవనాన్ని బాలికల వసతి గృహంగా మార్చారని.. దానిని హోటల్‌గా మార్చారని.. ఇది ఇల్లీగల్ నిర్మాణం అంటూ తన ఫిర్యాదులో పేర్కోన్నాడు. ఈ భవంతిని కూల్చేయాలని కోరారు. దీంతో ఈ ఏడాది ప్రారంభంలోనే బీఎంసీకి సోనూసూద్ కు మధ్య సంప్రదింపులు జరిగాయి. ఇక ఇదే విషయంపై సోనూసూద్ సూప్రీంకోర్టు వరకు వెళ్లారు. ఆ తర్వాత హైకోర్టు విచారణ అనంతరం తన పిటిషన్‌ను వెనక్కు తీసుకుని ఆ హోటల్‌ను తిరిగి నివాస భవనంగా మార్చేందుకు అంగీకరించారు.
ఇక తాజాగా బీఎంసీ పంపిన నోటీసులో ” భవనంలోని 1 నుంచి 6వ అంతస్థులలో మీరు వసతి.. బోర్డింగ్ కార్యకలాపాలను నిలిపివేసినట్లుగా లేఖలో పేర్కోన్నారు. మంజూరైన ప్లాన్ ప్రకారం ఆ భవనం కేవలం నివాస అవసరాలకు మాత్రమే ఉపయోగించబడుతుందని మీరు పేర్కోన్నారు. అదనంగా/మార్పు/పురోగతిలో అవసరమైన పని మార్పు ఉంది. కానీ.. అక్టోబర్ 20న భవనాన్ని చెక్ చేయగా.. ఆమోదించబడిన ప్లాన్ ప్రకారం మీరు ఇంకా ఆ భవనాన్ని పునరుద్ధరించలేదు. మీరు భవనాన్ని నివాసం కోసం పునరుద్దరిస్తామని జూలైలోనే మాకు హామీ ఇచ్చారు ” అంటూ గుర్తుచేసింది బీఎంసీ. ఇక ఆ భవనం పునరుద్ధరణ కోసం సోనూసూద్ కు ఏడు రోజుల సమయం ఇచ్చింది బీఎంసీ.
Also Read: Kamal Haasan: కమల్ హాసన్ పై తమిళనాడు ప్రభుత్వం సీరియస్.. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ..
Unstoppable With NBK: విలన్‌గా చేసేందుకు సై అంటున్న బాలకృష్ణ.. అఖండ టీంతో అన్‌స్టాపబుల్ కామెడీ..