AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda: బాలయ్య సినిమాపై స్పందించిన మోహన్‌ బాబు.. ఏమన్నారంటే..

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'అఖండ'. ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌గా నటించగా.. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Akhanda: బాలయ్య సినిమాపై స్పందించిన మోహన్‌ బాబు.. ఏమన్నారంటే..
Basha Shek
|

Updated on: Dec 06, 2021 | 2:18 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అఖండ’. ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌గా నటించగా.. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై ‘అఖండ’  మైన విజయం సాధించింది. చాలారోజుల తర్వాత సినిమా థియేటర్లన్నీ ప్రేక్షకులతో నిండిపోయాయి. ఇక బాలయ్య అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘అఖండ’ సినిమాపై పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌, కల్యాణ్‌ రామ్‌, అనిల్‌ రావిపూడి ఈ సినిమాను వీక్షించి తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో పంచుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ ‘అఖండ’ సినిమాను ప్రశంసిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘కరోనా ప్రభావంతో థియేటర్లకి ప్రేక్షకులు రారు.. చూడరు అనుకుంటున్న క్లిష్టపరిస్థితుల్లో ‘అఖండ’ సినిమా విజ‌యం సినీ పరిశ్రమకి మళ్లీ ఊపిరి పోసింది. విడుదలకి సిద్ధంగా ఉన్న మరికొన్ని చిత్రాలకు ధైర్యాన్నిచ్చింది. నా సోదరుడు బాలయ్యకు, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. అదేవిధంగా ఈ మంచి సినిమాని ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు’ మోహన్‌బాబు పేర్కొన్నారు. కాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘ఆహా’లో ప్రసారమైన ‘అన్‌స్టాపబుల్‌’ విత్ ఎన్‌బీకేలో మంచు ఫ్యామిలీ సందడి చేసిన సంగతి తెలిసిందే.

Also read:

Unstoppable With NBK: విలన్‏గా చేసేందుకు సై అంటున్న బాలకృష్ణ.. అఖండ టీంతో అన్‏స్టాపబుల్ కామెడీ..

Viral Photo: చిరునవ్వుతో ఫిదా చేస్తోన్న ఈ చిన్నారి టాలీవుడ్ ‘రౌడీ బేబి’.. ఎవరో కనిపెట్టండి చూద్దాం!

Kamal Haasan: కమల్ హాసన్ పై తమిళనాడు ప్రభుత్వం సీరియస్.. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!