Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దంపతుల ప్రాణాలు బలి తీసుకున్న మరో తాగుబోతు.. రీడింగ్ చూస్తే షాక్
అర్ధరాత్రి.. పట్టపగలు.. అనే తేడా లేదు. హైదరాబాద్ మహానగరంలో తాగుబోతు ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. గంటల వ్యవధిలో వరుస యాక్సిడెంట్లు చేశారు.
పీకలదాకా తాగడం.. ఆ మత్తులో బండెక్కడం.. తూలుతూనే స్టీరింగ్ పట్టుకోవడం.. 150 కిలోమీటర్ల స్పీడ్‌తో రయ్ రయ్ మంటూ దూసుకెళ్లడం. ఇది తాగుబోతు డ్రైవర్ల వాలకంగా మారిపోయింది. తాగిన మైకంలో వాళ్ల చావు వాళ్లు చావకుండా.. రోడ్లపై వెళ్తున్న వారిని అన్యాయంగా చంపేస్తున్నారు.
అర్ధరాత్రి.. పట్టపగలు.. అనే తేడా లేదు. హైదరాబాద్ మహానగరంలో తాగుబోతు ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. గంటల వ్యవధిలో వరుస యాక్సిడెంట్లు చేశారు. నలుగురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి సిటీ నడిబొడ్డున జరిగిన డ్రంకన్ యాక్సిడెంట్ మరిచిపోకముందే.. శివార్లలో మరో తాగుబోతు బీభత్సం సృష్టించాడు. నార్సింగిలో సంజీవ్ అనే యువకుడు మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో దంపతులు స్పాట్‌లో చనిపోయారు. మద్యం తాగి కారు డ్రైవ్ చేసిన సంజీవ్‌కు బ్రీతింగ్ టెస్టులో ఎన్ని పాయింట్లు వచ్చాయో తెలుస్తే మీరు షాక్ తింటారు. ఏకంగా అతడికి 148 పాయింట్ల ఆల్కహాల్ రీడింగ్ వచ్చింది. అంటే.. పీకలదాకా తాగి ప్రాణాలు తీయడం కోసమే అన్నట్టు రోడ్డెక్కాడు సంజీవ్. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలో 12 గంటల వ్యవధిలో రెండు డ్రంకెన్ డ్రైవ్ యాక్సిడెంట్స్ జరగడం సంచలనంగా మారింది.
Also Read: వాతావరణం కంటే వేగంగా మారుతోన్న టమాట ధర.. మరోసారి మోత పుట్టిస్తోంది