తెలంగాణలో తగ్గని పొలిటికల్ ఫీవర్.. మరో ఎన్నికపై పార్టీలు ఫోకస్..

| Edited By: Srikar T

May 15, 2024 | 2:40 PM

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిసినా మరో ఎన్నికకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. అదే ఈ నెల చివరన జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు పార్టీలు రెడీ అవుతున్నాయి. మూడు జిల్లాల నేతలతో మూడు పార్టీలు ముమ్మర కసరత్తు ప్రారంభించి.. పట్టభద్రుల స్థానంపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి.

తెలంగాణలో తగ్గని పొలిటికల్ ఫీవర్.. మరో ఎన్నికపై పార్టీలు ఫోకస్..
Brs Bjp Congress
Follow us on

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిసినా మరో ఎన్నికకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. అదే ఈ నెల చివరన జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు పార్టీలు రెడీ అవుతున్నాయి. మూడు జిల్లాల నేతలతో మూడు పార్టీలు ముమ్మర కసరత్తు ప్రారంభించి.. పట్టభద్రుల స్థానంపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సమరం సమాప్తమైన ఎన్నికల మోడ్ మాత్రం పోలేదు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హడావుడి మొదలైంది. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి చింతపండు నవీన్ మల్లన్న, బిఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బిజెపి తరపున ప్రేమెందర్ రెడ్డి బరిలో ఉన్నారు. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బిఆర్ఎస్ ప్రయత్నాలు గట్టిగా చేస్తోంది. ఈ నెల 27 న ఎమ్మెల్సీ బై పోల్ జరగనుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రధాన పార్టీలు పని ప్రారంభించాయి.

బిఆర్ఎస్‎కు సిట్టింగ్ సీట్ కావడంతో ఎలాగైన తిరిగి దక్కించుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ఖమ్మం వరంగల్ నల్గొండ్ జిల్లా నేతలతో సమావేశమై వ్యూహ రచన చేశారు. ప్రచార, సమన్వయ బాధ్యతలు కీలక నేతలకు అప్పగించి పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు ప్లాన్ వేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పడకుండా.. లోక్ సభ ఎన్నికల ప్రచార జోష్ తో ఎమ్మెల్సీ ప్రచార వ్యూహాలను కేటీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 12 రోజుల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పట్టభద్రులతో సమావేశాల నిర్వహకు స్కెచ్ వేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే ఊపుతో ఈ ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ఆయా జిల్లా నేతలతో రివ్యూ చేశారు. ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారంలో పాల్గొని గెలిపించే బాధ్యతను వారికి అప్పగించారు. అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 34 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా అందులో 33 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కీలకంగా పనిచేసి ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని నేతలకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రచార వ్యూహాలను పక్కాగా అమలు చేసి విజయబావుటా ఎగురవేయాలని కాంగ్రెస్ స్కెచ్ వేసింది.

మరోవైపు బిజెపి సైతం ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని ఊవ్విళ్లూరుతోంది. లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పూర్తిగా ఉప ఎన్నికపైనే ఫోకస్ చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆర్గనేజేషనల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ మూడు జిల్లాల నేతలు, రాష్ట్ర స్థాయినేతలతో ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జరుగుతున్న మూడు జిల్లాల అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా రాష్ట్రనేతలను ఇన్ చార్జులుగా నియమించారు. లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి ఎంతో పాజిటివ్ ట్రెండ్ వచ్చిందని.. గొప్ప ఫలితాలు రాబోతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. అదే పాజిటివిటీతో ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. మొత్తంగా మూడు పార్టీలు లోక్ సభ ఎన్నికల తర్వాత మూడు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక టార్గెట్ గా కార్యచరణలో బిజీ అయిపోయాయి. మరి పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..