Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయి.. రేవంత్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారుః మోదీ

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట సభలో మోదీ గ్యారంటీ అంటే ఏంటో వివరించారు ప్రధాని నరేంద్ర మోదీ. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి, భద్రత, ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ఠ పెంచడం అన్నారు. మోదీ గ్యారంటీ అంటే ఐదేళ్లలో 3 కోట్ల ఇళ్లు కట్టించడం, 70ఏళ్లు పైబడిన వారికి ఉచిత చికిత్స అందించడం అని చెప్పారు. మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలు అవుతుందని తెలిపారు ప్రధాని.

PM Modi: ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయి.. రేవంత్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారుః మోదీ
Modi In Mbnr
Follow us
Balaraju Goud

|

Updated on: May 10, 2024 | 4:52 PM

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట సభలో మోదీ గ్యారంటీ అంటే ఏంటో వివరించారు ప్రధాని నరేంద్ర మోదీ. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి, భద్రత, ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ఠ పెంచడం అన్నారు. మోదీ గ్యారంటీ అంటే ఐదేళ్లలో 3 కోట్ల ఇళ్లు కట్టించడం, 70ఏళ్లు పైబడిన వారికి ఉచిత చికిత్స అందించడం అని చెప్పారు. మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలు అవుతుందని తెలిపారు ప్రధాని.

ఈ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ధారించే ఎన్నికలన్న మోదీ, గత పదేళ్లలో తెలంగాణకు రూ. లక్షల కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. మేం ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకున్నారని మోదీ ఆరోపించారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లాగే కాంగ్రెస్‌ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేస్తోందన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ హామీలు మరిచి, ఫేక్ వీడియోల దుకాణం తెరిచిందని విమర్శించారు. ఆర్ఆర్ ట్యాక్స్‌పై ఢిల్లీలో సైతం చర్చ జరుగుతుందన్నారు మోదీ. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌లో ఎవరి పేరు చెప్పకుండా రేవంత్‌ రెడ్డి ఎలా స్పందించారని మోదీ ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ యువరాజుకు అమెరికాలో ఓ రాజగురువు ఉన్నాడని, దక్షిణ భారతీయులను ఆఫ్రికన్లతో పోల్చి అవమానిస్తున్నాడు. జాతి వివక్షతతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు హిందు దేవుళ్లను పూజించటం, అయోధ్యకు వెళ్లటం నచ్చదన్నారు. హిందువులను రెండో తరగతి పౌరులుగా గుర్తిస్తున్న కాంగ్రెస్.. ఈ దేశాన్ని కులాల వారీగా విభజించాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లను తీసివేస్తామని బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని ప్రదాని మోదీ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను కాపాడేందుకు చౌకీదార్ గా ఉంటానని మోదీ పునరుద్ఘాటించారు.

అభివృద్ధికి వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మోదీ శక్తిని పెంచాలంటే మహబూబ్ నగర్ లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న డీకే అరుణను గెలిపించాలని కోరారు. ఓ మహిళ అభ్యర్థి అరుణపై ముఖ్యమంత్రి అవమానకరమైన భాషను మాట్లాడుతున్నాడని, దీనికి ఓటుతోనే సమాధానం ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

డ్రమ్ములో వేసే ముందు భర్త బాడీతో ఏం చేసిందో తెలుసా?
డ్రమ్ములో వేసే ముందు భర్త బాడీతో ఏం చేసిందో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవితో చిందులేసిన స్టార్ హీరోల భార్యలు వీరే!
మెగాస్టార్ చిరంజీవితో చిందులేసిన స్టార్ హీరోల భార్యలు వీరే!
CSK ప్రాక్టీస్ వదిలి సైనికుల మధ్యకు చేరుకున్న ధోనీ.. వీడియో వైరల్
CSK ప్రాక్టీస్ వదిలి సైనికుల మధ్యకు చేరుకున్న ధోనీ.. వీడియో వైరల్
చేసింది 5 సినిమాలే.. దెబ్బకు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది
చేసింది 5 సినిమాలే.. దెబ్బకు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది
పెళ్లైన పది రోజులకే భర్తను..! సమాజం ఎటు పోతుంది?
పెళ్లైన పది రోజులకే భర్తను..! సమాజం ఎటు పోతుంది?
కలలో నెమలి కనిపిస్తుందా.. మంచిదా.. చెడ్డదా తెలుసుకోండి...
కలలో నెమలి కనిపిస్తుందా.. మంచిదా.. చెడ్డదా తెలుసుకోండి...
పెళ్లి కావడం లేదని మనస్తాపంతో డాక్టర్ ఏం చేశాడంటే..
పెళ్లి కావడం లేదని మనస్తాపంతో డాక్టర్ ఏం చేశాడంటే..
ఫుల్లుగా మద్యం తాగి పరీక్షహాలుకు వచ్చిన 10th విద్యార్ధి.. ఆ తర్వత
ఫుల్లుగా మద్యం తాగి పరీక్షహాలుకు వచ్చిన 10th విద్యార్ధి.. ఆ తర్వత
తల్లైనా తగ్గని అందం.. కాజల్ ను చూస్తే మతిపోవాల్సిందే!
తల్లైనా తగ్గని అందం.. కాజల్ ను చూస్తే మతిపోవాల్సిందే!
ఏంటీ.. కేజీ మామిడి రూ.3 లక్షలా?.. పెరట్లో ఈ చెట్టుంటే కోటీశ్వరులే
ఏంటీ.. కేజీ మామిడి రూ.3 లక్షలా?.. పెరట్లో ఈ చెట్టుంటే కోటీశ్వరులే