AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మజ్లిస్‌కి కంచుకోటపై కన్నేసిన పార్టీలు.. భాగ్యనగరంలో త్రిముఖ పోరు తప్పదా..?

Asad vs Masqati: హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పేట్లు లేదు. ఎంఐఎంకి కంచుకోటగా ఉన్న ఈ సీటుపై ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ గట్టిగానే గురిపెట్టాయి. అయితే ఎంఐఎం చీఫ్‌కి కాంగ్రెస్‌ నుంచి భారీ థ్రెట్‌ పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన ప్రచారంలోనూ ఆ పార్టీనే టార్గెట్‌ చేస్తూ వెళ్తున్నారు.

Hyderabad: మజ్లిస్‌కి కంచుకోటపై కన్నేసిన పార్టీలు.. భాగ్యనగరంలో త్రిముఖ పోరు తప్పదా..?
Hyderabad Politics
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Mar 03, 2024 | 9:01 AM

Share

Asad vs Masqati: హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పేట్లు లేదు. ఎంఐఎంకి కంచుకోటగా ఉన్న ఈ సీటుపై ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ గట్టిగానే గురిపెట్టాయి. అయితే ఎంఐఎం చీఫ్‌కి కాంగ్రెస్‌ నుంచి భారీ థ్రెట్‌ పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన ప్రచారంలోనూ ఆ పార్టీనే టార్గెట్‌ చేస్తూ వెళ్తున్నారు.

హైదరాబాద్‌ ఎంపీ సెగ్మెంట్‌ ఇప్పుడు హాట్‌సీట్‌గా మారింది. మజ్లిస్‌కి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంపై రెండు ప్రధాన జాతీయ పార్టీలు కన్నేశాయి. ఇప్పటికే బీజేపీ ఇక్కడ తన అభ్యర్థిని ప్రకటించింది. మజ్లిస్‌ అభ్యర్థి అందరికీ తెలిసిందే. సిట్టింగ్‌ ఎంపీ.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి విక్టరీ కోసం వెయిట్‌ చేస్తున్నారు. బీజేపీ ఓటర్లు.. బీజేపీకి ఉన్నారు. మజ్లిస్‌కి సెపరేట్‌ ఓటర్‌ బ్యాంక్ ఉంది. వీళ్లిద్దరి మధ్యలోకి కాంగ్రెస్‌ ఓ బలమైన అభ్యర్థిని తీసుకురాబోతోంది. అది కూడా ముస్లిం అభ్యర్థి కావడంతో.. మజ్లిస్‌కు మింగుడుపడడం లేదు.

పాతబస్తీలో సమ్మర్ ప్రారంభానికి ముందే ఎలక్షన్‌ హీట్‌ మొదలైంది. అప్పుడే హాట్‌ కామెంట్స్‌ చేస్తూ తన ప్రచారాన్ని పదునెక్కించారు ఒవైసీ.. రాజకీయంగా ఏమైనా చేయండి ధైర్యంగా ఎదుర్కొంటా.. అంతే కానీ వ్యాపారాల్లో సంపాదించిన కోట్ల సొమ్ముతో అనైతిక రాజకీయాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ బెల్ మోగించారు అసదుద్దీన్ ఒవైసీ. హైదరాబాద్ లోక్‌సభ స్థానం అంటే దశాబ్దాలుగా అది ఎంఐఎం అడ్డా. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభస్థానాలు ఉన్నా ఎక్కడ చర్చ సాగినా.. 16 స్థానాల్లోనే ఎన్నికలు అనేలా విష్లేషణలు ఉంటాయి. ఫలితం ఎలాగూ ఎంఐఎంకి అనుకూలంగా ఉంటుందని. ఈ సారి మాత్రం త్రిముఖ పోటీ గట్టిగానే ఉండబోతోందన్నది స్పష్టం.

బీజేపీ నుంచి విరించి హాస్పటల్స్‌ ఛైర్మన్‌ మాధవీలత బరిలోకి దిగుతున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి మస్కతీ డెయిరీ ప్రోడక్స్ట్‌ అధినేత అలీ మస్కతీ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. అలీ మస్కతీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు రేవంత్‌ సమక్షంలో చేరిన అలీ మస్కతీ.. ఎంఐఎంపై కామెంట్స్‌ కూడా చేశారు. హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో అసదుద్దీన్ కు ప్రధానంగా బీజేపీ అభ్యర్థులనుంచే పోటీ ఉండేది. అయితే ఈ సారి కాంగ్రెస్‌ పార్టీ సైతం ఓల్డ్ సిటీలో సీరియస్ ఫైట్‌ కి సిద్ధమయ్యింది. ఇందులో భాగంగానే అలీ మస్కతీని ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్‌ పెద్దలు. ఇప్పటికే అలీ మస్కతీ పాతబస్తీతోపాటు.. పలు ప్రాంతాల్లో తిరుగుతూ తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

కాంగ్రెస్‌లో చేరి ఎంఐఎంకు వ్యతిరేకంగా భారీగా ఖర్చుపెడుతున్న అలీ మస్కతీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అసదుద్దీన్‌ ఒవైసీ. వ్యాపారంలో ఏమైనా చేసుకోండి. రేవంత్‌ అండ చూసుకుని రెచ్చిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తనను రాజకీయంగా ఎదుర్కొంటే అభ్యంతరం లేదని.. విచ్చలవిడిగా సంపాదించిన సొమ్ముతో అనైతిక రాజకీయాలు చేస్తానంటే.. మీ ప్రొడక్ట్స్‌ సర్వనాశనమైపోతాయి అంటూ అలీ మస్కతీకి శాపనార్థాలు పెట్టారు అసద్‌. మీరు నా నియోజకవర్గంలో వేలు పెడితే నేను కూడా మీ నియోజకవర్గాల్లో అడుగుపెట్టి పోటీ చేస్తానంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు క్లియర్ మెసేజ్ పంపారు..

పాతబస్తీలో ఏకఛత్రాధిపత్యం నడిపిన అసద్‌కు.. ఇన్నాళ్లు బీజేపీ నుంచే పోటీ ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన ప్రత్యర్థిని రంగంలోకి దించడం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…