Telangana Lockdown: తెలంగాణలో మరో వారం రోజులు లాక్‌డౌన్ పొడిగింపు.? ఆ రోజే అధికారిక ప్రకటన.!!
కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యశాఖ అభిప్రాయం..
కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యశాఖ అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై వాణిజ్య, ఎక్సైజ్ శాఖలకు ప్రభుత్వం సంకేతాలిచ్చిందట. ఇదిలా ఉంటే కరోనా నియంత్రణ, లాక్‌డౌన్ పొడిగింపు అంశాలపై సీఎం కేసీఆర్ ఈ నెల 28వ తేదీన సమీక్ష నిర్వహించనున్నారు. ఆ రోజే లాక్‌డౌన్ పొడిగింపుపై అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
జూన్ మొదటి వారం వరకు లాక్‌డౌన్ పొడిగించాలని మెజారిటీ రాష్ట్రాలు భావిస్తున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణలో ఈ నెల 12వ తేదీ నుంచి లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో కేసుల సంఖ్య కొంతవరకు తగ్గింది. కాగా, ప్రస్తుతం తెలంగాణలో నేటి నుంచి రెండు డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతోంది.
కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం అమలు…
కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా పెంచుతూ కరోనాను కట్టడి చేయాలని సూచించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లను అందించే కార్యక్రమం సత్పలితాలిస్తున్నదని పేర్కొన్నారు. దాన్ని కొనసాగిస్తూనే, ప్రాధమిక వైద్య కేంద్రాలకు కరోనా పరీక్షల కోసం వస్తున్న ప్రతి ఒక్కరికీ నిరాకరించకుండా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. కరోనా పరీక్షలకు సంబంధించి రాపిడ్ యాంటీ జెన్ టెస్టు కిట్ల సంఖ్యను తక్షణమే పెంచాలన్నారు.
Also Read:
ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..
గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!
SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!